బుల్లితెరపై అతి పెద్ద రియాలిటీ షో గా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి కార్యక్రమాలలో బిగ్ బాస్( Bigg Boss ) కార్యక్రమం ఒకటి.బిగ్ బాస్ కార్యక్రమం అన్ని భాషలలోనూ ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకొని తెలుగులో ఇక ఈ కార్యక్రమం ఇప్పటికే ఆరో సీజన్లను పూర్తి చేసుకుని ఏడవ సీజన్ ప్రసారమవుతుంది.
ఇక ఏడవ సీజన్లో భాగంగా ఇప్పటికే మూడు వారాలు పూర్తి అయిన సంగతి మనకు తెలిసిందే.ఇక నాలుగవ వారం ప్రసారం అవుతూ ఉండగా నాలుగవ వారం మధ్యలో నుంచి బిగ్ బాస్ కంటెస్టెంట్, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth ) హౌస్ నుంచి బయటకు వచ్చారని తెలుస్తోంది.
బిగ్ బాస్ కార్యక్రమానికి సంబంధించి ఏ విషయమైనా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉంటాయి.అయితే కావాలనే మేకర్స్ ఇలాంటి విషయాలను లీక్ చేస్తారా లేక ఈ విషయాలన్నీ బయటకు ఎలా వస్తాయో తెలియదు కానీ ఈ కార్యక్రమానికి సంబంధించి ఎన్నో విషయాలు ఎపిసోడ్ కంటే ముందుగానే లీక్ అవుతూ సోషల్ మీడియా( Social Media )లో వైరల్ అవుతూ ఉంటాయి.సోషల్ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారమే కంటెస్టెంట్ల ఎలిమినేషన్ కూడా ఉంటుంది అయితే తాజాగా నాలుగో వారం జరుగుతూ ఉండగానే పల్లవి ప్రశాంత్ హౌస్ నుంచి బయటకు వచ్చారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బిగ్ బాస్ కార్యక్రమంలో భాగంగా కామన్ మ్యాన్ క్యాటగిరిలో పాల్గొన్నటువంటి పల్లవి ప్రశాంత్ నాలుగవ వారం మధ్యలోనే బయటకు వచ్చారని తెలుస్తోంది.అయితే ఈయన బయటికి రావడానికి మరే కారణం లేదు తాజాగా బిగ్ బాస్ ఇచ్చినటువంటి టాస్కులో గార్డెన్ లో ఉన్న ఏటీఎం నుంచి కాయిన్స్ కలెక్ట్( Bigg Boss ATM task ) చేయమని చెబుతారు.ఎవరి దగ్గర ఎక్కువగా ఉంటే వారు పవర్ అస్త్ర పొందడానికి అర్హులు అని చెప్పడంతో కంటెస్టెంట్లు పోటాపోటీగా కాయిన్స్ కలెక్ట్ చేయడానికి పరుగులు తీస్తారు.
ఈ క్రమంలోనే పల్లవి ప్రశాంత్ కింద పడటంతో ఆయన తలకు తీవ్రమైనటువంటి గాయం( Pallavi Prashanth Injured ) అయింది అందుకనే ఈయనని హౌస్ నుంచి బయటకు పంపించాలని బహుశా తిరిగి మళ్లీ హౌస్ లోకి పంపించవచ్చు అని కూడా తెలుస్తుంది.మరి పల్లవి ప్రశాంత్ ఈ కారణం చేత బయటకు వెళ్లారా లేక మరేదైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది.