బ్లాక్ పెప్పర్ (నల్ల మిరియాలు) ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం, జింక్, విటమిన్ బి, విటమిన్ ఎ, విటమిన్ కె, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్ ఇలా బోలెడన్ని పోషకాలు నల్ల మిరియాల్లో నిండి ఉంటాయి.
అందుకే ఇవి అనేక అనారోగ్య సమస్యలను నివారించడంలో సమర్ధవంతంగా పని చేస్తాయి.అయితే ఆరోగ్యానికి మాత్రమే కాదు జుట్టు సమస్యలకు చెక్ పెట్టడంలోనూ మిరియాలు ఉపయోగపడతాయి.
మరియాలను ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందు ఒకటిన్నర స్పూన్ మిరియాలు తీసుకుని మెత్తగా పడి చేసుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్లో అర కప్పు పెరుగు మరియు మిరియాలు పొడి వేసి బాగా కలుపుకోవాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టు మొదళ్ల నుంచి చివర్ల వరకు పట్టించాలి.
ఇరవై, ముప్పై నిమిషాల అనంతరం కెమికల్స్ తక్కువగా ఉండే షాంపూతో హెడ్ బాత్ చేసేయాలి.ఇలా వారంలో రెండు సార్లు చేస్తే హెయిర్ ఫాల్ తగ్గుతుంది.మరియు తెల్ల జుట్టు నల్ల బడుతుంది.

చుండ్రును నివారించడంలోనూ బ్లాక్ పెప్పర్ ఉపయోగపడుతుంది.ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, మూడు లెమన్ జ్యూస్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అర గంట తర్వాత గోరు వెచ్చని నీటితో తల స్నానం చేయాలి.
నాలుగు రోజులకు ఒక సారి ఇలా చేస్తే చుండ్రు పరార్ అవుతుంది.
జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగాలి అని కోరుకునే వారు.
ఒక గిన్నెలో రెండు స్పూన్ల నల్ల మిరియాల పొడి, నాలుగు ఆయిల్ ఆయిల్ వేసి మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని జుట్టు మొత్తానికి పట్టించి.
కాసేపటి తర్వాత హెడ్ బాత్ చేయాలి.ఇలా చేయడం వల్ల క్రమంగా జుట్టు పెరగడం స్టార్ట్ అవుతుంది.