ఇలా చేస్తే పొట్ట సమస్యలు చిటికలో మాయం..

ఈ రోజుల్లో చాలా రకాల కారణాల వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలతో బాధపడేవలసి వస్తుంది.ఈ బిజీ లైఫ్ లో అసలు సమయపాలన లేని ఆహారం, అలాగే సరిగ్గా వ్యాయామం చేయకపోవడం వంటి పలు అంశాలు మన ఆరోగ్యం పై ఖచ్చితంగా చాలా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

 Follow These Remedies To Get Rid Of Stomach Related Problems Details,  Remedies-TeluguStop.com

అంతేకాకుండా ఈ మధ్యకాలంలో చాలా మంది ప్రజలు ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.ఇటువంటి చెడు ఆహారపు అలవాట్లు వల్ల మీరు కచ్చితంగా పొట్ట సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది.

ముఖ్యంగా కడుపునొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.దీని నుంచి ఉపశమనం పొందాలంటే ఇంట్లో తయారు చేసిన కొన్ని రకాల పానీయాలు తాగితే చాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

వీటిని తాగడం వల్ల చాలా ఈజీగా మీ కడుపునొప్పి మాయమవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.మరి ఆ డ్రింక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Curd, Fennel Tea, Tips, Stomach Ache, Stomach-Telugu Health

కడుపు సంబంధిత సమస్యలను దూరం చేయడంలో పెరుగు చాలా విధాలుగా మేలు చేస్తుంది.ఒక కప్పు పెరుగులో జీలకర్ర పొడి, ఇంకా బ్లాక్ సాల్ట్ వేసి ఆ రెండిటిని బాగా కలిపి తాగాలి.ఆ తర్వాత దానిని తాగడం వల్ల కడుపు సమస్యలు చాలా ఈజీగా దూరమవుతాయి.ఇక ఈ కడుపు సమస్యలను చెక్ పెట్టడంలో సొంపు టీ కూడా అద్భుతంగా పనిచేస్తుంది.

ఈ టీ తాగడం వల్ల కడుపులో మంటను చాలా ఈజీగా నివారించవచ్చు.

Telugu Curd, Fennel Tea, Tips, Stomach Ache, Stomach-Telugu Health

మరిగించిన నీటిలో ఒక స్పూన్ సొంపు అలాగే రెండు స్పూన్ల తులసి ఆకులు వేసి బాగా వేడి చేసి ఆ తర్వాత వడగట్టి తాగాలి.ఇలా తాగడం వల్ల వెంటనే ఉపశమనం లభిస్తుంది.అలాగే వాము నీరు తాగడం వల్ల కూడా కడుపు సంబంధిత సమస్యల నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.

అందుకోసం వామును నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తీసుకోవడం వల్ల కడుపునొప్పి సమస్య త్వరగా నయమవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube