మన భారతదేశ వంటకాలలో సాధారణంగా ఉపయోగించే సుగంధ ద్రవ్యాలలో గరం మసాల( garam masala ) అగ్రస్థానంలో ఉంటుందని కచ్చితంగా చెప్పవచ్చు.ఈ గరం మసాలాను తయారు చేయడానికి లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర ( Cloves, cinnamon, cumin )మొదలైన మసాలా దినుసులను ఉపయోగిస్తారు.
ముఖ్యంగా నాన్ వెజ్ ప్రియులకు మసాలాలు లేని వంటకం అసంపూర్ణంగా అనిపిస్తూ ఉంటుంది.గరం మసాలా మీ ఆహారానికి రుచిని మాత్రమే తీసుకొని రావడం మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

ముఖ్యంగా చెప్పాలంటే గరం మసాలాలో ఖనిజాలు పుష్కలంగా ఉన్నందున ఇది మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను( Health benefits ) కూడా అందిస్తుంది.మరి ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.గరం మసాలా వంటలలో ఉపయోగించడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది.అలాగే పొట్టలో గ్యాస్టిక్ జ్యూస్ విడుదల అవడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.అంతేకాకుండా ఇది ప్రేగుల కదలికలను సులభంతరం చేస్తుంది.అసిడిటీ, ఉబ్బరం, అజీర్ణం ( Acidity, bloating, indigestion )వంటి జీర్ణ క్రియ సంబంధించిన సమస్యలను దూరం చేస్తుంది.
గరం మసాలా అనేది అనేక మసాలా దినుసులు కలయిక అని దాదాపు చాలా మందికి తెలుసు.

ఈ పదార్థాలలో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.ఇవి శరీర జీవక్రియ రేటును పెంచడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.బరువు తగ్గడానికి ప్రయత్నించే వారికి ఇది ఎంతో మంచిది.
ఎందుకంటే అధిక జీవక్రియ రేటు అంటే శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ కెరరీలు ఖర్చు అవుతాయి.ఒక వ్యక్తి అధిక జీవక్రియ సామర్థ్యం కలిగి ఉంటే అతను ఎక్కువ కేలరీలు వినియోగించిన బరువు పెరగడు.
అలాగే మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పదార్థాల కోసం గరం మసాలాను వంటకాలలో ఉపయోగించవచ్చు.గరం మసాలాలో మీ గుండెకు మేలు చేసే ఏలకులు ఉంటాయి.
ఈ మసాలాలను మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.