విదేశీయులు మన ఇండియన్ స్ట్రీట్ ఫుడ్( Indian Street Food ) ట్రై చేసే వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.తాజాగా అలాంటి ఓ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో చక్కర్లు కొడుతోంది.
ఇందులో ఓ ఫారిన్ వ్లాగర్ ముంబై వీధుల్లో ( foreign vlogger on the streets of Mumbai )ఫస్ట్ టైమ్ ఫేమస్ వడా పావ్ రుచి చూసిన ఫన్నీ మూమెంట్ అందరినీ ఆకట్టుకుంటోంది.ఈ రీల్‌ను పాపులర్ కంటెంట్ క్రియేటర్ జంట అయిన నిక్, క్యారీ షేర్ చేశారు.
నిక్ మన భారతీయుడే కాగా, క్యారీది హాంకాంగ్.ఆ స్పైసీ స్నాక్‌కు క్యారీ ఇచ్చిన రియాక్షన్ ఫన్నీగా ఉన్నప్పటికీ, తను ఆర్డర్ చేసిన విధానమే ఈ వీడియో వైరల్ అవ్వడానికి అసలు కారణం.
“నా గర్ల్‌ఫ్రెండ్ స్ట్రీట్‌లో మొదటిసారి వడా పావ్ ట్రై చేస్తోంది” అనే టెక్స్ట్‌తో వీడియో మొదలవుతుంది.క్యారీ, నిక్, మరో ఇద్దరు ఫ్రెండ్స్‌తో కలిసి ఉంది.ఆర్డర్ మాత్రం తనే చేస్తానని ఎంతో కాన్ఫిడెంట్‌గా ముందుకొచ్చింది.ఇద్దరూ కలిసి అక్కడి వెండార్‌ను “భయ్యా” అని పిలిచారు.ఆ తర్వాత క్యారీ మరాఠీలో మాట్లాడే ప్రయత్నం చేసింది.చిరునవ్వుతో, అన్నయ్యా, నాకు వడా పావ్ ఇవ్వు అని అడిగింది.ఆమె యాస, ఆ ప్రయత్నం చూసి ఫ్రెండ్స్ అంతా నవ్వేశారు.“కరెక్ట్‌గా చెప్పానా?” అని ఆమె అడిగింది.“నీకెలా తెలుసు ఈ మాట?” అని నిక్ అడగ్గా, “గూగుల్ చేశా.” అని క్యారీ నవ్వుతూ చెప్పిన సమాధానం అక్కడ ఉన్నవారందరినీ మళ్లీ నవ్వించింది.క్యారీ ఆర్డర్‌ను ఆ వెండార్ ఇట్టే అర్థం చేసుకుని, క్షణాల్లో వేడి వేడి వడా పావ్ చేతికిచ్చాడు.
“అబ్బో ఎంత ఫాస్ట్” అని నిక్ ఆశ్చర్యపోయాడు.క్యారీ ఆ స్నాక్ తీసుకుని ఓ కొరుకు కొరికింది. వెంటనే, “వావ్, సూపర్ ఉంది” అనేసింది.“హోటల్ వడా పావ్‌తో పోలిస్తే ఎలా ఉంది?” అని నిక్ అడిగాడు.దానికి క్యారీ ఆనందంగా, “దానికంటే ఇదే వెయ్యి రెట్లు బెటర్.10కి 10 మార్కులు” అని రిప్లై ఇచ్చింది.ఈ వీడియో ఆన్‌లైన్‌లో నెటిజన్ల మనసు దోచేసింది.
చాలామంది క్యారీ మాట్లాడిన మరాఠీ, ఆమె యాసెంట్ క్యూట్‌గా ఉన్నాయని కామెంట్స్ చేశారు.కొందరు ఆమె ప్రయత్నాన్ని మెచ్చుకుంటే, ఇంకొందరు ‘త్వరలో ఈ వడాపావ్ భయ్యా కూడా డాలీ చాయ్ వాలా అంత ఫేమస్ అయిపోతాడేమో’ అని సరదాగా జోక్స్ వేశారు.
ఒక యూజర్ అయితే, “థాంక్స్ ఫర్ డూయింగ్ దిస్ ది రైట్ వే” (సరైన పద్ధతిలో చేసినందుకు ధన్యవాదాలు) అని కామెంట్ పెట్టారు.గతంలో కూడా స్కాట్లాండ్‌కు చెందిన ఓ వ్లాగర్ మిస్తీ దోయ్ (బెంగాలీ స్వీట్ యోగర్ట్) ట్రై చేసిన వీడియో ఇలాగే తెగ వైరల్ అయిన విషయం గుర్తుండే ఉంటుంది.