హిందువులు బ్రాహ్మణులను( Hindus , Brahmins ) దైవ సమానులుగా భావిస్తారు.ఎలాంటి శుభకార్యమైన వారి సలహాలు, సూచనలు తీసుకుని మొదలుపెడతారు.
అయితే బ్రాహ్మణులు అంతా దైవ సమానులు కాదు.కొంతమంది బ్రాహ్మణులతో పూజలు చేయిస్తే అవి సత్ఫలితాలను ఇవ్వవని ఈ పండితులు చెబుతున్నారు.
ఇలాంటి బ్రాహ్మణులు ఎలాంటి కార్యక్రమాలు చేయాలో గరుడ పురాణంలో పేర్కొన్నారు.గరుడ పురాణంలో( Garuda Puranam ) కొందరు బ్రాహ్మణులు లేదా పండితుల సమక్షంలో పూజలు, హోమం, హోమం-హవనాలు చేయకూడదని తెలిపారు.
ముఖ్యంగా చెప్పాలంటే మంత్ర విద్యా లేదా భూత వైద్యం చేసే పూజారులు ఎప్పుడూ యాగం, పూజ( Sacrifice, worship ) లేదా శ్రద్ధ కర్మలు చేయకూడదు.ఈ పండితుడిని శ్రద్ధ కార్యక్రమాలకు ఎంచుకుంటే పూర్వికులు నిరాధారణకు గురవుతారని గరుడ పురాణంలో ఉంది.వారిలో ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.మేకలు మేపే బ్రాహ్మణుడు, బొమ్మలు గీసే బ్రాహ్మణుడు, జ్యోతిష్యంలో నిమగ్నమైన వారు ఎలాంటి పూజలు, హోమాలు చేయకూడదు.ఈ నాలుగు రకాల బ్రాహ్మణులతో పూజలు, హోమాలు చేయించడం వల్ల మనం చేసే పూజలకు పుణ్య ఫలితం ఉండదని గరుడ పురాణంలో ఉంది.
ఇంకా చెప్పాలంటే వేదాల గురించి తక్కువ జ్ఞానం ఉన్న బ్రాహ్మణుడితో పూజలు చేయించకూడదు.ధనాపేక్షతో హోమం చేసే పండితుల పూజలు వృధా అవుతాయి.అటువంటి పండితులు కేవలం ధనాపేక్షతో పూజా హోమాలు చేస్తారు తప్ప పూజ ఫలితాల కోసం కాదు.
ఇంకా చెప్పాలంటే ఎప్పుడూ ఇతరుల సొమ్ము తీసుకునేవాడు, అబద్దాలు చెప్పేవాడు, హింస చేసేవాడు మంచి పండితులు కాలేరని గరుడ పురాణం చెబుతోంది.ఇంకా చెప్పాలంటే ఎప్పుడూ ఇతరులను విమర్శించే వాడు, మత్తులో ఉన్నవాడు అంటే ధూమపానం, మద్యపానం అలవాటు ఉన్నవాడు, అటువంటి దుష్ట పండితులు లేదా బ్రాహ్మణుల చేత పూజలు, యాగాలు చేయించడం వల్ల నరకానికి వెళ్తారని గరుడ పురాణంలో ఉంది.
DEVOTIONAL