సాధారణంగా ప్రతి ఒక్కరు వారి ఇష్టదైవాలకు వివిధ రకాలుగా పూజలు చేస్తూంటారు.ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ వారి కుటుంబం సిరి సంపదలతో తులతూగాలని భావించి పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు.
ఇలా చాలామంది లక్ష్మీదేవికి పూజ చేయటం వల్ల అమ్మవారి కరుణాకటాక్షాలు మనపై ఉండి మనకు సిరిసంపదలను కలుగజేస్తుందని భావిస్తారు.ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున లక్ష్మీదేవి అనుగ్రహం కోసం వివిధ రకాలలో పూజలు చేస్తూ అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు.
అయితే అమ్మవారి అనుగ్రహం మనపై ఉండి మన ఇంట్లో సిరిసంపదలు వెల్లి విరియాలంటే తప్పకుండా అమ్మవారికి స్పటిక మాలతో పూజ చేయాలని పండితులు చెబుతుంటారు.వేదాల ప్రకారం స్పటిక మాల ధరించి అమ్మవారికి పూజ చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది.
పర్వతాల పై ఉండే మంచు స్పటిక రూపంలో కింద పడుతూ ఉంటుంది.ఈ విధంగా తెల్లని స్వచ్ఛమైన స్పటిక మాల ధరించి అమ్మవారికి పూజ చేయాలని పండితులు చెబుతుంటారు.

ఈ స్పటిక మాలతో యోగ, ధ్యానం వంటివి చేయడం ద్వారా మన మనసు ఎల్లప్పుడు నిశ్చలంగా పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది.అలాగే మన ఇంట్లో లక్ష్మీదేవి ఫోటోకి ఎల్లప్పుడు ఇలాంటి స్పటిక మాల వేసి పూజ చేయటం వల్ల ఆ అమ్మవారి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉండి మన కుటుంబంలో ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆర్థికాభివృద్ధిని కలుగజేస్తుంది.