కళ్ళ కింద ఉబ్బు తగ్గటానికి సమర్ధవంతమైన ఇంటి నివారణలు

సాదారణంగా నిద్ర సరిగ్గా లేకపోతే కళ్ళ కింద ఉబ్బు వస్తుంది.కళ్ళ కింద చర్మం మరియు రక్త నాళాలు చాలా సున్నితంగా ఉంటాయి.

 How To Get Rid Of Puffy Eyes Home Remedies-TeluguStop.com

అయితే చికాకు, అలెర్జీలు, అతిసారం, ఒత్తిడి, వంశపారంపర్యం, హార్మోన్ల హెచ్చుతగ్గులు, కొన్ని రకాల మందులు వాడకం వంటి కారణాల వలన కంటి కింద ఉబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి.కళ్ళ కింద ఉబ్బును తగ్గించుకోవటానికి కొన్ని ఇంటి నివారణలు ఉన్నాయి.వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1.దోసకాయ

దోసకాయ ఉబ్బిన కళ్ళను తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.దీనిలో అధిక నీటి కంటెంట్ మరియు ఆస్ట్రిజెంట్ గుణాలు ఉండుట వలన రక్త నాళాలను బిగుతుగా ఉంచటం మరియు కంటి కింద వాపును తగ్గించటంలో సహాయపడుతుంది.విశ్రాంతిగా కూర్చొని లేదా పడుకొని కళ్ళ మీద చల్లని నీటిలో ముంచిన దోసకాయ ముక్కను పెట్టుకొని పది నిమిషాల పాటు అలా ఉంటే తక్షణ ఉపశమనం కలుగుతుంది.

2.చల్లని నీరు

చల్లని నీటి చికిత్స కంటి కింద ఉబ్బును తగ్గించటంలో సహాయపడుతుంది.చల్లని నీటిని ముఖంపై చల్లి శుభ్రం చేసుకొని అరగంట సేపు విశ్రాంతి తీసుకోవాలి.చల్లటి నీరు రక్త నాళాలను బిగుతుగా మార్చి ఉబ్బు తగ్గటంలో సహాయపడుతుంది.ఈ ప్రక్రియను రోజులో అనేక సార్లు చేస్తే మంచి పలితం కనపడుతుంది.

3.బంగాళదుంప

బంగాళదుంపలో పిండి పదార్ధం ఉండుట వలన యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ గా పనిచేస్తుంది.బంగాళదుంప ముక్కలుగా కోసి కళ్ళ మీద పెట్టి 5 నిముషాలు అయ్యిన తర్వాత శుభ్రంగా కడిగితే మంచి ఉపశమనం కలుగుతుంది.

4.ఆలివ్ నూనె మరియు టీ బ్యాగ్

టీ సంచులను చల్లదనం కోసం కొంచెం సేపు రిఫ్రిజిరేటర్ లో ఉంచాలి.మొదట కళ్ళను మూసుకొని కంటి రెప్పల మీద ఒక కాటన్ బాల్ సాయంతో ఆలివ్ ఆయిల్ ని రాయాలి.ఆ తర్వాత కంటి కింద బాగంలో చల్లని టీ బ్యాగ్ లను ఉంచి 5 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

5.గుడ్డు తెల్లసొన మరియు విచ్ – హజెల్

ఒక బౌల్ లో రెండు గుడ్డు తెల్ల సోన, రెండు చుక్కల విచ్ – హజెల్ ని వేసి బాగా కలిపి బ్రష్ సాయంతో కంటి కింద ప్రభావిత ప్రాంతంలో రాయాలి.ఈ విధంగా చేయుట వలన కంటి కింద చర్మం బిగిసి ఉబ్బు తగ్గుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube