ఖలేజా టైటిల్ వల్ల వాళ్లు 10 లక్షల రూపాయలు పోగొట్టుకున్నారట.. అసలేమైందంటే?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Superstar Mahesh Babu ,director Trivikram Srinivas)కాంబినేషన్ లో ఒకప్పుడు తెరకెక్కిన చిత్రం ఖలేజా.ఈ సినిమా 2010 లో విడుదల అయ్యి ఆశించిన స్థాయిలో ఫలితాలను రాబట్టలేకపోయింది.

 Behind The Story Of Khaleja Title, Khaleja, Khaleja Movie, Tollywood, Mahesh Bab-TeluguStop.com

మహేశ్‌బాబు బాడీ లాంగ్వేజ్‌, కామెడీ టైమింగ్‌ను ఒక భిన్న కోణంలో చూపించి, అభిమానులను అలరించింది.అయితే ఈ సినిమా విడుదల సమయంలో టైటిల్‌ పై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.

ఖలేజా అనే టైటిల్‌ ను ఒక వ్యక్తి నిర్మాతల మండలిలో ముందే రిజిస్టర్‌ చేసుకున్నారు.మహేశ్‌(Mahesh) మూవీకి చిత్ర బృందం ఈ టైటిల్‌ ను ప్రకటించేసరికి ఆ వ్యక్తి తన వద్ద ఉన్న ఆధారాలను తీసుకొని న్యాయ స్థానాన్ని ఆశ్రయించారట.

ఖలేజా సినిమా విడుదల కాకుండా ఇంజెక్షన్‌ ఆర్డర్‌ ఇవ్వాలని న్యాయ మూర్తిని కోరారట.అన్ని పత్రాలను పరిశీలించిన న్యాయమూర్తి ఖలేజా(Khaleja)’ టైటిల్‌ ను రిజిస్టర్‌ చేసుకున్న వ్యక్తికి ఒక సూచన చేశారు.

వాళ్లు ఇప్పటికే షూటింగ్‌, ప్రచార కార్యక్రమాలు పూర్తి చేశారు.సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ సమయంలో సినిమా విడుదల కాకుండా ఆపమంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సమంజసం కాదేమో.నష్టపరిహారం కోరడం ద్వారా మీకు న్యాయం చేయవచ్చు.

మీరు ఎంత కోరుకుంటున్నారో చెప్పండి అని అడిగారట.తుది తీర్పును భోజన విరామం తర్వాత ప్రకటిస్తానని న్యాయమూర్తి చెప్పారట.

Telugu Khaleja, Mahesh Babu, Tollywood-Movie

దీంతో ఆ వ్యక్తి రూ.10 లక్షలు పరిహారం కింద కోరారట. ఖలేజా (Khaleja)నిర్మాతలు కూడా రూ.10 లక్షలు ఇచ్చేందుకు అంగీకారం తెలిపారట.న్యాయమూర్తే స్వయంగా పరిహారం ఇప్పిస్తానని చెప్పడంతో టైటిల్‌ రిజిస్టర్‌ చేసుకున్న వ్యక్తి తన మనసు మార్చుకున్నారట.విరామానంతరం కోర్టు మళ్లీ ప్రారంభం కాగా తనకు రూ.10 లక్షలు కాదని, రూ.25 లక్షలు ఇవ్వాలని కోరారట.దీంతో కొద్దిసేపు వాదోపవాదనలు జరిగాయట.తొలుత రూ.10 లక్షలు తీసుకునేందుకు అంగీకరించి ఆ తర్వాత మాట మార్చిన విషయం న్యాయమూర్తికి తెలిసింది.దీంతో ఆయన స్పందిస్తూ ఇప్పుడే ఈ కేసుపై పూర్తి విచారణ చేపట్టలేం.

అలాగే తుది నిర్ణయమూ తీసుకోలేం.మరికొన్ని ఆధారాలను పరిశీలించాల్సి ఉంది.

అప్పటివరకూ సినిమా ఆగకుండా కోర్టు ఆపలేదు.

Telugu Khaleja, Mahesh Babu, Tollywood-Movie

ఈ కేసుకు సంబంధించి పూర్తి ఆధారాలతో మళ్లీ రండి.అప్పటివరకూ మీ పిటిషన్‌ డిస్మిస్‌ చేస్తున్నా అంటూ న్యాయమూర్తి తీర్పు ప్రకటించడంతో ఖలేజా టైటిల్‌ ను రిజిస్టర్‌ చేసుకున్న వ్యక్తి ఆశ్చర్యపోయారట.మరోవైపు సినిమాకు ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా మహేశ్‌ ఖలేజా అంటూ చిత్ర బృందం సినిమాను విడుదల చేసిందట.

అప్పట్లో పలు సినిమాల టైటిల్స్‌ విషయంలో ఇండస్ట్రీలో పెద్దఎత్తున చర్చ జరిగింది.ఈ కేసును వాదించిన న్యాయవాది కూడా పలు ఇంటర్వ్యూల్లో ఈ విషయాన్ని పంచుకున్నారు.ఇలాంటి సమయంలో చాలామంది దర్శక నిర్మాతలు తెలివిగా తాము అనుకున్న టైటిల్‌ ముందు హీరో పేరు పెట్టి సినిమాలను విడుదల చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube