ప్రతి సీజన్లో దొరికే అతి తక్కువ పండ్లలో అరటిపండు ఒకటి. అరటిపండు ( Banana )తక్కువ ధరలతో పాటు అన్ని చోట్ల కూడా సులభంగా దొరుకుతుంది.
అయినప్పటికీ చాలామంది దీన్ని తినడానికి ఇష్టపడరు.కానీ అరటిపండు తినడం వలన బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు( Health benefits ) ఉన్నాయి.
అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.అరటి పండు చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తినేందుకు అనువుగా ఉంటుంది.
ఇది ఆరోగ్యపరంగా చాలా మేలు చేస్తుంది.అలాగే సక్రమమైన జీర్ణక్రియ( Digestion ) నుంచి గుండె ఆరోగ్యం వరకు అనేక ప్రయోజనాలని చేకూరుస్తుంది.
ఇందులో అనేక రకాల పుష్కలమైన పోషక విలువలు కూడా ఉన్నాయి.

అరటి పండులో పిండి పదార్థాలు, నీటి శాతం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు తగిన మోతాదులో లభిస్తాయి.అలాగే ప్రోటీన్ కూడా లభిస్తుంది.ఇక అరటి పండులో కొవ్వు అస్సలు ఉండదు.
అందుకే సమతుల్య ఆహారంలో భాగంగా అరటిపండును తీసుకోవడం చాలా అవసరం.ఈ పండును మన ఆహారంలో చేర్చుకోవడం వలన శరీరానికి రోజంతా కావాల్సిన శక్తి పోషకాలు లభిస్తాయి.
అంతేకాకుండా ఎన్నో రకాల ఆరోగ్య లాభాలు కూడా పొందవచ్చు.అరటి పండులో విటమిన్ సి, విటమిన్ b6, పొటాషియం, మ్యాంగనీస్ లాంటి విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
ఇవి మన రోగ నిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి.

అంతేకాకుండా జీవక్రియ సక్రమంగా పనిచేయడంలో కూడా సహాయపడతాయి.అరటిపండులో ప్రక్టోజ్, సుక్రోజ్ లాంటి సహజ చక్కెరలు ఉంటాయి.ఇవి మన శరీరానికి స్థిరమైన శక్తిని అందిస్తాయి.
ఇక అరటి పండ్లలో ఫైబర్ అలాగే పెక్టిన్ అధికంగా ఉంటాయి.కాబట్టి జీర్ణవ్యవస్థ సక్రమంగా జరిగేందుకు ఇది సహాయపడతాయి.
అంతేకాకుండా ప్రేగు కదలికలను కూడా నియంత్రిస్తుంది.అలాగే అరటి పండ్లను క్రమం తప్పకుండా తినడం వలన మలబద్ధక సమస్య కూడా దూరం అవుతుంది.
అరటి పండులో పొటాషియం స్థాయి రక్తపోటును( Blood pressure ) నియంత్రించడంలో సహాయపడతాయి.దీంతో ఇది గుండె ఆరోగ్యానికి కూడా చాలా సహాయపడుతుంది.