ఈ హోమ్ మేడ్ ఆరెంజ్ ఆయిల్ ను వాడితే క్లియర్ గ్లోయింగ్ మరియు షైనీ స్కిన్ మీ సొంతమ‌వుతుంది!

ప్రస్తుత వింటర్ సీజన్ లో అత్యధికంగా లభించే పండ్లలో ఆరెంజ్ ఒకటి.ఆరెంజ్ రుచిగా ఉండడమే కాదు బోలెడన్ని పోషక విలువలు కలిగి ఉంటుంది.

 Use This Homemade Orange Oil To Get Clear Glowing And Shiny Skin Details! Orange-TeluguStop.com

అలాగే ఆరెంజ్ ఆరోగ్యాన్ని పెంచడంతో పాటు చర్మ సౌందర్యానికి సైతం ఎంతగానో సహాయపడుతుంది.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే హోమ్‌ మేడ్ ఆరెంజ్ ఆయిల్ ను వాడితే క్లియర్, గ్లోయింగ్ మరియు షైనీ స్కిన్ మీ సొంతం అవుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆరెంజ్ ఆయిల్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండి.

ముందుగా రెండు ఆరెంజ్ పండ్లు తీసుకుని వాటర్ తో శుభ్రంగా క‌డ‌గాలి.

ఇలా క్లీన్ చేసుకున్న ఆరెంజ్ పండ్లు తడి లేకుండా తుడుచుకోవాలి.ఆపై తొక్క మాత్రమే వచ్చేలా తురుముకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో అరకప్పు కొబ్బరి నూనె, అరకప్పు బాదం నూనె వేసుకోవాలి.ఆయిల్ హీట్ అవ్వగానే అందులో తురిమి పెట్టుకున్న ఆరంజ్ పీల్‌ వేసుకుని చిన్న మంటపై కనీసం ఎనిమిది నుంచి ప‌ది నిమిషాల పాటు ఉడికించాలి.

Telugu Badam Oil, Tips, Clear Skin Skin, Coconut Oil, Homemadeorange, Latest, Or

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టైనర్ సాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ ఆయిల్ పూర్తిగా చల్లారిన‌ తర్వాత ఒక బాటిల్ లో నింపుకోవాలి.ఈ ఆరెంజ్ ఆయిల్ చ‌ర్మ సౌందర్యానికి ఎంతో మేలు చేస్తుంది.రోజు ఉదయం స్నానం చేయడానికి గంట ముందు ఈ ఆయిల్ ను ముఖానికి, మెడకు అప్లై చేసుకుని స్మూత్ గా కొన్ని నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.

Telugu Badam Oil, Tips, Clear Skin Skin, Coconut Oil, Homemadeorange, Latest, Or

ఇలా ప్రతిరోజు కనుక చేస్తే చర్మంపై మొండి మచ్చలు, మొటిమలు మాయం అవుతాయి.స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది.డ్రై స్కిన్ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.చర్మం స్మూత్ గా, కాంతివంతంగా మారుతుంది.క్లియర్, గ్లోయింగ్ అండ్ షైనీ స్కిన్ మీ సొంతం అవుతుంది.కాబట్టి అందంగా కాంతివంతంగా మెరిసిపోవాలని భావించేవారు తప్పకుండా ఈ ఆరెంజ్ ఆయిల్ ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.

మంచి రిజల్ట్ మీ సొంతమవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube