తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది.హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ ప్రగతిభవన్ ను గ్రనేడ్లతో పేల్చాలని వ్యాఖ్యనించిన సంగతి తెలిసిందే.
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ తీవ్రస్థాయిలో ఆగ్రహాం వ్యక్తం చేస్తోంది.బీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి రేవంత్ వ్యాఖ్యలను ఖండించారు.
ఈ క్రమంలోనే డీజీపీకి ఫిర్యాదు చేస్తామన్న ఎమ్మెల్యే పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేతలు సమర్థిస్తారా అని అడిగారు.
దేశంలో ఉన్న పీసీసీలు అందరూ రేవంత్ తరహా కామెంట్స్ చేస్తారా అని ప్రశ్నించారు.