మణిరత్నం.క్లాసిక్ సినిమాలతో అద్భుత దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సమయం అది.అంతేకాదు.ఆ రోజుల్లో తన సినిమాలకు ఎంతో క్రేజ్ ఉండేది.
ఆయన సినిమాలను కొనుగోలు చేసేందుకు బయ్యర్లు బాగా పోటీ పడేవారు.అదే సమయంలో మణిరత్నం సినిమాలు అంటే హీరో మురళీ మోహన్ కు ఎంతో ఇష్టం ఉండేది.
అటు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేసేవాడు మురళీ మోహన్.సినిమాలను కూడా నిర్మించేవాడు.
రెండు మూడు సార్లు మణిరత్నం సినిమాలు కొనాలనుకున్నా కుదరలేదు.అందుకు మణిరత్నం ఇద్దరు అనే సినిమా తీస్తున్నట్లు తెలిసింది.
వెంటనే ఆయనను కలిసి మీ తర్వాత చిత్రం మాకే ఇవ్వాలి అంటూ మురళీ మోహన్ భారీగా అడ్వాన్స్ ఇచ్చాడు.
ఈ సినిమాను కొనాలి అనే ఆసక్తి మరళీ మోహన్ కు కలగడానికి మరో కారణం ఉంది.
ఎంజీఆర్, కరుణానిధి కథతో ఈ సినిమాను ప్లాన్ చేశాడు మణిరత్నం.అందుకే అడిగినంత డబ్బు ఇచ్చి సినిమాను తెలుగులో, తమిళంలో ఒకే రోజు విడుదల చేయాలి అనే ఒప్పందం చేసుకున్నారు.
సినిమా చాలా ఫాస్ట్ గా తెరెక్కిస్తున్నాడు మణిరత్నం.సినిమా జరుగుతున్న తీరును తెలుసుకోవాలి అనుకున్నాడు మురళీ మోహన్.అయితే సినిమా రిలీజ్ కు ముందు తన సినిమా కథ కాదు.కనీసం ఆల్బమ్ కూడా చూపించేవారు కాదు మణిరత్నం.
షూటింగ్ సెట్ లోకి కూడా ఎవరినీ రానచ్చేవాడు కాదు.

నిజానికి ఈ షరతులు ఇష్టం లేకపోయినా మురళీ మోహన్ ఒప్పుకున్నాడు.అయితే ఈ సినిమాకు ఎంతో హైప్ వచ్చింది.భారీగా ఖర్చు పెట్టి విడుదల చేశారు కూడా.
కానీ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు.పెట్టిన డబ్బు గంగలో కలిసింది.
ఈ సినిమా మూలంగా మురళీ మోహన్ సంపాదన అంతా కరిగిపోయింది.అయినా తను ఎక్కగా కుంగిపోలేదు.
పోయింది డబ్బే.ఆత్మ విశ్వాసం కాదంటూ ముందుకు వెళ్లాడు.
కష్టపడి పని చేసి మళ్లీ తన పూర్వ వైభవాన్ని తెచ్చుకున్నాడు.