సినిమా చరిత్ర లోనే కామెడీ సినిమాలకు మంచి ప్రాధాన్యత ఉంటుంది.రెండున్నర గంటలు కడుపుబ్బా నవ్వడానికి సినిమాకు వెళ్లే వారు చాలానే ఉంటారు.
ఎంత సేపు ఏడుపులు పెడబొబ్బలు, డిష్యుమ్ డిష్యుమ్ అంటూ ఫైట్స్ , రొటీన్ ప్రేమకథలు చూడాలంటే పరమ బోరు.అందుకే కాస్త నవ్వండి అంటూ వదిలే చిత్రాలకు మంచి డిమాండ్ ఉంది.
మొన్నటికి మొన్న జాతి రత్నాలు ఇదే కాన్సెప్ట్ తో వచ్చి హిట్ అయినా సంగతి మనం చూస్తూనే ఉన్నాం.గతం లోకి వెళ్తే అల్లరి నరేష్ కేవలం కామెడీ సినిమాలు ఏడాది కి అరడజన్ కి పైగా తీసి అవతల పడేసేవారు.
హిట్టు ప్లాప్ తో సంబంధం లేకుండా అవి నడుస్తూనే ఉన్నాయ్.
ఇక ఇంకా కాస్త వెనక్కి వెళితే పరిస్థితి ఇంకోలా ఉండేది.పెద్ద హీరోలు ఫుల్ లెన్త్ కామెడీ సినిమాలు చేస్తే థియేటర్ లో ప్లాప్ అయ్యేవి.అందుకు ఉదాహరణ గా చూస్తే చిరంజీవి చంటబ్బాయ్, కృష్ణ గారు చేసిన కృష్ణావతారం, బాలయ్య బాబు చేసిన బాబాయ్ అబ్బాయి వంటివి చూడచ్చు.
ఈ మూడు కూడా మంచి కామెడి సినిమాలు టీవీ లో ఇప్పటికి వచ్చిన చూస్తారు కానీ పెద్ద తెర పై మాత్రం వర్క్ అవుట్ అవ్వలేదు.అప్పటి హీరోలు సీరియస్ గా యాక్షన్ చేస్తేనే జనాలు బాగా చూసేవారు.
అయితే అప్పట్లో కామెడీ చిత్రాలు తీయాలన్న దర్శకులకు వరంగా లభించాడు చంద్ర మోహన్.బి ఎన్ రెడ్డి తీసిన రంగుల రాట్నం సినిమా ద్వారా 1964 లో పరిచయం అయ్యాడు చంద్ర మోహన్.
కృష్ణం రాజు వంటి ఆరడుగుల హీరోను పక్కన పెట్టి చంద్ర మోహన్ కి డైరెక్టర్ అవకాశం ఇచ్చాడు.
ఆ తర్వాత హీరో వేషాలు రాకపోయినా పెద్ద హీరోల సినిమాల్లో చిన్న వేషాలు, విలనీ వేషాలు వేసాడు.ఆ తర్వాత 70 ల వరకు సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే హాస్య కథ చిత్రాలకు మెయిన్ హీరో గా అవతారం ఎత్తాడు.ఫ్యామిలీ సినిమాలు అయితే శ్రీధర్, మురళి మోహన్, రంగనాథ్ వంటి వారు చేస్తే, 80 వ దశకం వచ్చే సరికి కొత్త నిర్మాత ఎవరైనా సరే చంద్ర మోహన్ ఉండాల్సిందే అన్నట్టు గా ఉండేది పరిస్థితి.
కొత్త హీరోయిన్స్కి కూడా ఆయనే అవకాశం ఇచ్చేవారు.జయసుధ, శ్రీదేవి మరియు జయప్రద వంటి వారు చంద్ర మోహన్ సరసన చేశాకే స్టార్స్ అయ్యారు.