తరచూ వంటింట్లో ఈ వస్తువులు కింద పడుతున్నాయా..? అయితే దరిద్రం వెంటాడుతున్నట్టే..

జ్యోతిష్యంలో శుభప్రదమైనవి ఆ శుభకరమైనవి కూడా ఉన్నాయి.అయితే కొన్ని సంఘటనలు మన జీవితంలో రాబోయే శుభాలు, అశుభాలకు ప్రతికాలుగా ఉంటాయని జ్యోతిష్యం( Jyotishyam ) విశ్లేషిస్తుంది.

 Bad Luck If These Things Often Fall Down In The Kitchen Details, Bad Luck ,thing-TeluguStop.com

అయితే కొన్ని సంఘటనలు జరగడం ద్వారా మనకు మంచి లేదా చెడు జరుగుతుంది.ఇలాంటి వాటిని శకునాలు అని అంటారు.

శుభశుకునాలు, ఆశుభశకునాలు అనేవి రెండు రకాలుగా ఉంటాయి.మంచి శకునం తలపెట్టిన కార్యాలయాల్లో ఆటంకాలు రాకుండా పూర్తవుతోందని అనడానికి ప్రతీకలైతే, అపశకునాలు మాత్రం కాబోయే చెడుకు సంకేతాలుగా నమ్ముతారు.

అయితే ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు సిద్ధపడుతున్న సమయంలో ఏడుపులు వినిపించడం, వెనుక నుంచి ఎవరైనా పిలిచి ముందుకు వెళ్లకుండా ఆపడం లాంటివి చేస్తే అపశుకాలుగా భావిస్తారు.అలాగే ఇలాంటప్పుడు బయటకు వెళ్తే వెళ్ళిన చోట పనులు పూర్తికావని ఒక నమ్మకం.అయితే కొన్ని వస్తువులు చేజారితే అశుభంగా నమ్ముతారు.ఇవి భవిష్యత్తులో రాబోయే విపత్తులకు సూచన కూడా కావచ్చు.

అలాగే ఎదురయ్యే నష్టాలకు, కష్టాలకు హెచ్చరిక కూడా కావచ్చు.

Telugu Bad Luck, Bhakti, Devotional, Kitchen, Kumkuma, Milk, Mud Oil, Pooja Hara

అయితే పాల గిన్నె లేదా పాలు ఉన్న పాత్ర( Milk ) చేజారి కింద పడిపోతే అపశుగుణంగా పరిగణించాలి.అంతేకాకుండా పాలు ఉలిక్కిపోవడం ఆర్థిక నష్టానికి సూచన.అందుకే పాలు నేల మీద ఒలికి పోకుండా జాగ్రత్తగా ఉండాలి.

అంతేకాకుండా చేతి నుంచి ఉప్పు( Salt ) చేజారిపోయిన కూడా అశుభంగా నమ్ముతారు.ఎందుకంటే జాతక చక్రంలో చంద్రుడు, శుక్రుడు ఏ విధంగా ఉందో ఇది తెలిపే సూచన.

అంతేకాకుండా వైవాహిక జీవితంలో సమస్యలు కూడా వస్తాయి.

Telugu Bad Luck, Bhakti, Devotional, Kitchen, Kumkuma, Milk, Mud Oil, Pooja Hara

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆవనూనె వలికి పోవడం కూడా మంచిది కాదు.ఇలా జరిగితే శని దృష్టి మీ మీద సరిగ్గా లేదని అర్థం.అందుకే ఇలా జరిగినప్పుడు పరిహారంగా శని పూజ చేయాలి.

చేతి నుండి హారతి పళ్లెం చేజారి పోవడం కూడా అశుభ సంకేతం.ఇది పూజలో జరిగే లోపాన్ని సూచిస్తుంది.

దేవుడు మీ మీద కోపంగా ఉన్నాడని గ్రహించాలి.అలాగే పదేపదే కుంకుమ చేజారి కింద పడిపోయిన అపశగుణం భావించాలి.

ఇలా కుంకుమ చేజారి పోతే దాంపత్యంలో గొడవలు, విడిపోవడానికి సూచన అని చెప్పవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube