ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.08
సూర్యాస్తమయం: సాయంత్రం.6.03
రాహుకాలం: ఉ.9.00 ల10.30
అమృత ఘడియలు: ఉ.6.22 ల7.11
దుర్ముహూర్తం: ఉ.6.30 ల7.36
మేషం:
ఈరోజు ముఖ్యమైన విషయాలలో స్వంత నిర్ణయాలు కలిసిరావు.కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి.చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది.వృత్తి ఉద్యోగమున విలువైన పత్రములు విషయంలో జాగ్రత్త వ్యవహరించాలి.దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
వృషభం:
ఈరోజు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు.
దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు.
మిథునం:
ఈరోజు ఋణ ఒత్తిడి అధికమై మానసిక శిరో భాధలు కలుగుతాయి.దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.దైవ సేవా కార్యక్రమాలలో ఆప్తులతో పాల్గొంటారు.
సంతాన విద్యా విషయంలో ఊహించని విషయాలు తెలుస్తాయి.స్థిరాస్తి ఒప్పందాలు అతికష్టం మీద పూర్తవుతాయి.వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.
కర్కాటకం:
ఈరోజు చుట్టుపక్కల వారితో ఆస్థి వివాదాలు పరిష్కరించుకుంటారు.వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.వృత్తి ఉద్యోగాలలో అధికారుల సహాయంతో పదోన్నతులు పెరుగుతాయి.
ముఖ్యమైన పనులలో ఆత్మ విశ్వాసంతో పని చేసి లాభాలు అందుకుంటారు.నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి.
సింహం:
ఈరోజు ఆప్తుల నుండి అవసరానికి ధన సహకారం అందుతుంది.పాత రుణాలు నుండి విముక్తి లభిస్తుంది.సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది.వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది.వ్యాపార పరంగా నూతన పెట్టుబడులు లభిస్తాయి.సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
కన్య:
ఈరోజు ప్రయాణాలలో మార్గ అవరోధాలు తప్పవు.ధన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు.వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి.ఊహించని రీతిలో ఖర్చులు పెరుగుతాయి.ఇంటా బయట ప్రతి విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
తుల:
ఈరోజు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.సంతానం విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి.దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.
వృశ్చికం:
ఈరోజు చెయ్యని పనికి ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి.అనవసర వస్తువులపై ధనవ్యయం చేస్తారు.ఉద్యోగమున పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు.
నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.ఆప్తులతో మాట పట్టింపులు కలుగుతాయి.
ధనుస్సు:
ఈరోజు కీలక వ్యవహారాలలో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుని లాభాలు అందుకుంటారు.నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి.నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.ఇతరుల నుండి ఆశించిన సహాయం అందుతుంది సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.
మకరం:
ఈరోజు కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది.
చేపట్టిన పనులు అనుకూలంగా సాగుతాయి.నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
కుంభం:
ఈరోజు మీకు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉంటాయి.అనవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.
కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాలలో గొడవలు జరిగే అవకాశం ఉంది.ఈరోజు వ్యాపారస్తులు శుభ ఫలితాలను పొందుతారు.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుతాయి.
మీనం:
ఈరోజు ఆర్థికపరంగా లాభాలు ఉన్నాయి.ఇంటిలో పండగ వాతావరణం వల్ల ఖర్చు పెరుగుతుంది.వాయిదాగా ఉన్న పనులు ఈరోజు పూర్తవుతాయి.
వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.ఈరోజు ఒక శుభవార్త వింటారు.
దానివల్ల సంతోషంగా ఉంటారు.