విటమిన్ ఈ ఆయిల్ తో జుట్టుకు ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

విట‌మిన్ ఈ ఆయిల్(Vitamin E oil) గురించి ప‌రిచ‌యం అక్క‌ర్లేదు.మెడిక‌ల్ షాప్స్ లో మ‌న‌కు విటమిన్ ఈ ఆయిల్ క్యాప్సూల్స్ రూపంలో లేదా బాటిల్ లో దొరుకుంది.

 Are There So Many Benefits For Hair With Vitamin E Oil! Vitamin E Oil, Vitamin E-TeluguStop.com

విట‌మిన్ ఈ ఆయిల్ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ (Antioxidant)గుణాలను కలిగి ఉంటుంది.అందువ‌ల్ల చ‌ర్మ సంర‌క్ష‌ణ‌తో పాటు జుట్టు ఆరోగ్యానికి కూడా ఇది ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.

ముఖ్యంగా జుట్టుకు విట‌మిన్ ఈ ఆయిల్ తో ఎన్ని ప్ర‌యోజ‌నాలు ఉన్నాయో తెలిస్తే నిజంగా ఆశ్చ‌ర్య‌పోతారు.

విట‌మిన్ ఈ ఆయిల్ తలలో తేమను పెంచుతుంది.

తల చర్మాన్ని తేమగా ఉంచి పొడి మరియు పొడిబారిన జుట్టును నివారిస్తుంది.అలాగే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉండి, విట‌మిన్ ఈ ఆయిల్‌ ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.

చుండ్రు(Dandruff) స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న‌వారికి విట‌మిన్ ఈ ఆయిల్ ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది.చుండ్రు సమస్యను దూరం చేయ‌డంలో, స్కాల్ప్ ఇన్ఫెక్ష‌న్స్(Scalp infections) కు చెక్ కు పెట్ట‌డంలో విట‌మిన్ ఈ ఆయిల్ హెల్ప్ చేస్తుంది.

Telugu Care, Care Tips, Fall, Healthy, Vitamin, Vitamin Oil, Vitaminoil-Telugu H

అంతేకాదండోయ్.విటమిన్ ఈ ఆయిల్‌ రక్తప్రసరణను మెరుగుపరిచి జుట్టు ఊడిపోవడాన్ని తగ్గిస్తుంది.విటమిన్ ఈ ఆయిల్ ఉపయోగించడం వల్ల జుట్టు దృఢంగా మ‌రియు కాంతివంతంగా కూడా మారుతుంది.ఇక ఈ ప్ర‌యోజ‌నాల‌న్ని పొందాలంటే విట‌మిన్ ఈ ఆయిల్ ను ఎలా ఉప‌గించాలో కూడా తెలుసుకోవాలి.

విట‌మిన్ ఈ ఆయిల్ ను నేరుగా తలకు అప్లై చేసుకుని మ‌సాజ్ చేసుకోవ‌చ్చు.ఆయిల్ అప్లై చేసుకున్న 40 నిమిషాల అనంత‌రం మృదువైన షాంపూతో హెయిర్ వాష్ చేసుకోవాలి.

Telugu Care, Care Tips, Fall, Healthy, Vitamin, Vitamin Oil, Vitaminoil-Telugu H

అలాగే విటమిన్ ఈ ఆయిల్ ను కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ లేదా బాదం నూనెతో క‌లిపి త‌ల‌కు ప‌ట్టించ‌వ‌చ్చు.ఇలా చేయ‌డం ద్వారా జుట్టు మ‌రింత ఆరోగ్య‌క‌రంగా మారుతుంది.ఇక మీ రోజువారీ షాంపూ లేదా కండీషనర్‌లో కొన్ని చుక్కలు విటమిన్ ఈ ఆయిల్ జోడించి కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు.ఇలా ఏదో విధంగా విటమిన్ ఈ ఆయిల్‌ను వాడ‌టం అల‌వాటు చేసుకుంటే.

జుట్టు ఆరోగ్యంగా, మృదువుగా, మెరుస్తూ ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube