విటమిన్ ఈ ఆయిల్ తో జుట్టుకు ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?
TeluguStop.com
విటమిన్ ఈ ఆయిల్(Vitamin E Oil) గురించి పరిచయం అక్కర్లేదు.మెడికల్ షాప్స్ లో మనకు విటమిన్ ఈ ఆయిల్ క్యాప్సూల్స్ రూపంలో లేదా బాటిల్ లో దొరుకుంది.
విటమిన్ ఈ ఆయిల్ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ (Antioxidant)గుణాలను కలిగి ఉంటుంది.అందువల్ల చర్మ సంరక్షణతో పాటు జుట్టు ఆరోగ్యానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
ముఖ్యంగా జుట్టుకు విటమిన్ ఈ ఆయిల్ తో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు.
విటమిన్ ఈ ఆయిల్ తలలో తేమను పెంచుతుంది.తల చర్మాన్ని తేమగా ఉంచి పొడి మరియు పొడిబారిన జుట్టును నివారిస్తుంది.
అలాగే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉండి, విటమిన్ ఈ ఆయిల్ ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.
చుండ్రు(Dandruff) సమస్యతో బాధపడుతున్నవారికి విటమిన్ ఈ ఆయిల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.చుండ్రు సమస్యను దూరం చేయడంలో, స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్(Scalp Infections) కు చెక్ కు పెట్టడంలో విటమిన్ ఈ ఆయిల్ హెల్ప్ చేస్తుంది.
"""/" /
అంతేకాదండోయ్.విటమిన్ ఈ ఆయిల్ రక్తప్రసరణను మెరుగుపరిచి జుట్టు ఊడిపోవడాన్ని తగ్గిస్తుంది.
విటమిన్ ఈ ఆయిల్ ఉపయోగించడం వల్ల జుట్టు దృఢంగా మరియు కాంతివంతంగా కూడా మారుతుంది.
ఇక ఈ ప్రయోజనాలన్ని పొందాలంటే విటమిన్ ఈ ఆయిల్ ను ఎలా ఉపగించాలో కూడా తెలుసుకోవాలి.
విటమిన్ ఈ ఆయిల్ ను నేరుగా తలకు అప్లై చేసుకుని మసాజ్ చేసుకోవచ్చు.
ఆయిల్ అప్లై చేసుకున్న 40 నిమిషాల అనంతరం మృదువైన షాంపూతో హెయిర్ వాష్ చేసుకోవాలి.
"""/" /
అలాగే విటమిన్ ఈ ఆయిల్ ను కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ లేదా బాదం నూనెతో కలిపి తలకు పట్టించవచ్చు.
ఇలా చేయడం ద్వారా జుట్టు మరింత ఆరోగ్యకరంగా మారుతుంది.ఇక మీ రోజువారీ షాంపూ లేదా కండీషనర్‌లో కొన్ని చుక్కలు విటమిన్ ఈ ఆయిల్ జోడించి కూడా ఉపయోగించవచ్చు.
ఇలా ఏదో విధంగా విటమిన్ ఈ ఆయిల్‌ను వాడటం అలవాటు చేసుకుంటే.జుట్టు ఆరోగ్యంగా, మృదువుగా, మెరుస్తూ ఉంటుంది.