ముఖ్యంగా చెప్పాలంటే మన దేశంలోని దాదాపు చాలా పుణ్య క్షేత్రాలకు ప్రతిరోజు ఎన్నో లక్షల మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు.అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనిశ్రీశైలం మల్లన్న( Srisailam Mallanna ) దర్శనం కోసం ప్రతిరోజు ఎన్నో లక్షలాది మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు.
సాధారణ రోజుల తో పోలిస్తే పర్వదినాలు పండుగ రోజుల లో భక్తుల తాకిడి ఇంకా ఎక్కువగా ఉంటుంది.అలాగే చాలామంది భక్తులు నది స్నానాలు చేసి శ్రీశైలం మల్లన్న ను దర్శనం చేసుకుంటూ ఉంటారు.
అయితే ఇక పై ఆ వీలు ఉండదని శ్రీశైలం ముఖ్య అధికారులు చెబుతున్నారు.

శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ తక్కువగానే ఉంది.అయితే ఈ సమయంలో మహా కుంభాభిషేకం, శివరాత్రి( Shivratri ) ఉత్సవాలు జరగనున్నాయి.శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ పరిమితంగానే ఉండడం వలన శ్రీశైల దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.
అంతేకాకుండా భక్తులు స్నానాలు చేసేందుకు దేవాలయ అధికారులు ప్రత్యేక సేవలను కూడా ఏర్పాటు చేస్తున్నారు.అయితే శ్రీశైల జలాశయంలో పూర్తిస్థాయి నీటి మట్టం 2005 టీఎంసీలు ఉంటే ప్రస్తుతం 38.8 టీఎంసీల నీరు మాత్రమే ఉందని అధికారులు చెబుతున్నారు.

ఈ సంవత్సరం మార్చి 1వ తేదీ నుంచి మార్చి 11వ తేదీ వరకు కుంభాభిషేకం, శివరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.అయితే ఈ సందర్భంగా భక్తులు కృష్ణ జిల్లా( Krishna District )లో స్నానమాచరించడం ఆనవాయితీగా వస్తూ ఉంది.అయితే నీటి సమస్యను తగ్గించేందుకు, భక్తులు స్నానాలు చేసేందుకు వీలుగా నీటిని సంరక్షించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు.
దీంతో రాజుల సత్రం, ఆర్టీసీ బస్టాండ్ వెనక ఉన్న పాతాళ గంగ, స్నానఘట్టాల వద్ద షవర్ లు ఏర్పాటు చేయాలని అనుకున్నారు.అలాగే ఆనకట్ట దిగువన ఉన్న లింగాలగట్టు వద్ద స్నానాలు చేసేందుకు చర్యలు కూడా చేపట్టారు.