సాధారణంగా లిక్విడ్ నైట్రోజన్ ( Liquid Nitrogen)ఉష్ణోగ్రత -196 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది.ఇది చాలా తక్కువ ఉష్ణోగ్రతలలో ఉండడంతో ఆహారాన్ని ఫ్రీజ్ చేయడానికి, పడవకుండా చూసేందుకు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.
మన వాతావరణంలో 78 శాతం వరకు నైట్రోజన్ ఉంటుంది.ఇది రంగు వాసన లేని గ్యాస్.
క్రయోజనిక్ పద్ధతి( Cryogenics)లో మైనస్ -150 డిగ్రీల సెల్సియస్ వద్ద ఈ గ్యాస్ ను ద్రవ రూపంలోకి మారుస్తారు.లిక్విడ్ నైట్రోజన్ కు మండే స్వభావం ఉండదు.

ఇతర గ్యాస్ లతో ఇది చర్యలు జరపదు.దీన్ని విషపురితం కానీ వాయువుగా పరిగణిస్తారు.అయితే నైట్రోజన్ ద్రవ రూపంలో ఉండేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఎందుకంటే మైనస్ నూట తొంబై ఆరు డిగ్రీల సెల్సియస్ అన్నది చాలా తక్కువ ఉష్ణోగ్రత కాబట్టి సరైన మాస్కులు లేకుండా దీన్ని జోలికి వెళ్తే కాస్త తగిలిన శరీరంలోని కణాలు ఫ్రీజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.
సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద లిక్విడ్ నైట్రోజన్ త్వరగా వాయువులా మారి గదిలో కలిసిపోతుందని నిపుణులు చెబుతున్నారు.ఇది పొగ రూపంలో మనకు కనిపిస్తుంది.

అయితే దీన్ని ఎక్కువగా పీల్చితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వస్తుంది.ఎందుకంటే చుట్టుపక్కల ఉండే ఆక్సిజన్ ను మనకు నైట్రోజన్ అందకుండా చేస్తుంది.ముఖ్యంగా చెప్పాలంటే ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలలో( Food processing industries ) లిక్విడ్ నైట్రోజన్ ఎన్నో సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు.మాంసం, చేపలను ప్రాసెస్ చేసేందుకు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు.
చేపలను నిల్వ చేయడానికి, అలాగే తోలు పరిశ్రమలో, మాంసాపు ముక్కలుగా కోసిన తర్వాత వెంటనే ఫ్రిజ్ చేయడానికి లిక్విడ్ నైట్రోజన్ ఉపయోగిస్తూ ఉంటారు.దీని వల్ల ఆహారంలోని సూక్ష్మ జీవులన్నీ ఫ్రిజ్ అవుతాయి.
లిక్విడ్ నైట్రోజన్ పూర్తిగా ఆవిరయ్యే వరకు అలానే ఉంచాలి.ఆ తర్వాత అధిక ఉష్ణోగ్రత వద్ద వండుకొని తినాల్సి ఉంటుంది.
దీన్ని ఆహారంలో కలిపి నేరుగా ఎప్పుడు తీసుకోకూడదు.ఇలా చేస్తే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి.
అలాగే ప్రసవ సమయంలో తల్లి బొడ్డుతాడు, ప్లసెంటాలోని మూల కణాలను భద్రపరచడంలోనూ లిక్విడ్ నైట్రోజన్ ను ఉపయోగిస్తారు.