అరికాళ్ళు మంటలు స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా చాలా మంది కామన్‌గా ఎదుర్కొనే సమస్యల్లో ఇది ఒకటి.శరీరంలో అధిక వేడి, పాదాల్లో నాడులు దెబ్బ తినటం, రక్తహీనత, మద్య పానం, మధుమేహం, పోషకాల లోపం, పలు రకాల మందుల వాడకం ఇలా రకరకాల కారణాల వల్ల అరికాళ్ళు మంట పడుతూ ఉంటాయి.
ఇక ఈ సమస్యను ఎలా తగ్గించుకోవాలో తెలియక నానా ఇబ్బందులు పడుతుంటారు.అయితే అలాంటి సమయంలో ఇంట్లోనే కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సులువుగా అరికాళ్ళ మంటలను తగ్గించుకోవచ్చ మరి ఆ టిప్స్ ఏంటో చూసేయండి.
అరికాళ్ళ మంటలను నివారించడంలో యాపిల్ సైడర్ వెనెగర్ గ్రేట్‌గా సహాయపడుతుంది.టబ్‌లో గోరు వెచ్చని నీరు పోసి అందులో యాపిల్ సైడర్ వెనెగర్ వేసి బాగా మిక్స్ చేయాలి.
ఇప్పుడు ఈ వాటర్ పాదాలను కాసేపు ఉంచితే.మంటలు తగ్గుతాయి.
అలాగే బొప్పాయి పండు కూడా పాదాల అరికాళ్ళ మంటలను తగ్గించగలద ముందు బాగా పండిన బొప్పాయి పండు గుజ్జు తీసుకుని అందులో కొద్దిగా పెరుగు మరియు నిమ్మ రసం వేసి మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అరికాళ్ళకు అప్లై చేసి.అర గంట అనంతరం కూల్ వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల పాదాల మంటలు మటు మాయం అవుతాయి.
అల్లంతో కూడా అరికాళ్ళ మంటలకు చెక్ పెట్టవచ్చు.అల్లం తీసుకుని మెత్తగా నూరి రసం తీసుకోవాలి.
ఇప్పుడు ఈ రసంలో కొద్దిగా కొబ్బరి నూనె యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని అరికళ్ళలో అప్లై చేసి మసాజ్ చేసుకుని అనంతరం చల్లటి నీటితో శుభ్రంగా వాష్ చేసుకోవాలి.
ఇలా చేసినా మంటలు తగ్గు ముఖం పడతాయి.