తెలంగాణా ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)(BRS) కాంగ్రెస్ ప్రభుత్వాన్ని(Congress government) హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో టార్గెట్ చేస్తున్న నేపధ్యంలో ఆసక్తికర విషయాలు కాంగ్రెస్(Congress) బయటపెడుతోంది.పర్యావరణ విధ్వంసం జరిగిందని బీఆర్ఎస్(BRS) ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
ముఖ్యంగా వన్యప్రాణులపై తీవ్ర ప్రభావం పడినట్లు బీఆర్ఎస్ ఆవేదన వ్యక్తం చేస్తోంది.దీనికి మద్దతుగా సోషల్ మీడియాలో అనేక వీడియోలను షేర్ చేస్తోంది.
2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ పాలనలో పెద్ద ఎత్తున అటవీ నిర్మూలన జరిగిందని ఆరోపణలు చేస్తోంది.అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అటవీ విస్తీర్ణాన్ని పెంచే లక్ష్యంతో హరిత హారం కార్యక్రమాన్ని ఆరంభించి, దాదాపు రూ.10,000 కోట్లు ఖర్చు చేసిందని పేర్కొంది.2015 నుంచి 2022 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం 219 కోట్ల మొక్కలను నాటినట్లు ప్రకటించింది, ఈ కార్యక్రమం కోసం రూ.9,777 కోట్లు కేటాయించింది.రెండు శాఖల నుంచి భారీగా నిధులు విడుదలయ్యాయి.గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి రూ.5,006.82 కోట్లు, అటవీ శాఖ (Forest Department)నుంచి రూ.2,567.12 కోట్లు విడుదల చేసారు.

అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్(Chief Minister KCR), నాటిన మొక్కల్లో 85 శాతం బతికాయని ప్రకటించారు.అయితే, ఇది నిజమైతే, తెలంగాణ అటవీ విస్తీర్ణం 2014లో 21,591 చదరపు కిలోమీటర్ల నుంచి 2021 నాటికి 21,213 చదరపు కిలోమీటర్లకు ఎందుకు తగ్గిందని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది.అంతేకాక, 2014 నుంచి 2024 వరకు బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్(KCR) ప్రభుత్వం అధికారికంగా 11,422.47 హెక్టార్ల అటవీ భూమిని అటవీయేతర ప్రయోజనాల కోసం మళ్లించిందని ఆరోపిస్తోంది.

మరోవైపు, కాలేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project)కోసం 2016 నుంచి 2019 మధ్య 12,12,753 చెట్లను నరికి, ఫారెస్ట్ కన్సర్వేషన్ యాక్ట్‌ను బీఆర్ఎస్ ఉల్లంఘించిందని మండిపడుతోంది.ఈ ప్రాజెక్టు ఎటువంటి ప్రయోజనాలు ఇవ్వకపోయినా, దాని కోసం 8,000 ఎకరాల అడవులు తొలగించారని ఆరోపణలు చేస్తోంది.అప్పట్లో పర్యావరణవాదులు ఎందుకు మౌనంగా ఉన్నారని ఆ పార్టీ సోషల్ మీడియా నిలదీస్తోంది.
అంతే కాకుండా 2014 నుంచి 2023 మధ్య బీఆర్ఎస్ ప్రభుత్వం 4,28,437 ఎకరాల భూమిని విక్రయించిందని, ఇందులో ఎక్కువ భాగం అటవీ భూములేనని ఆరోపిస్తోంది.బీఆర్ఎస్ పాలనలో పర్యావరణం పట్ల ఈ ప్రేమ లేనప్పుడు, ఇప్పుడు ఎందుకు పుట్టుకొచ్చింది అని.నిలదీస్తున్నారు.