అమెరికాలో( America ) నివసిస్తున్న అక్రమ వలసదారులను వెనక్కి పంపడంతో పాటు కొత్తగా అమెరికా వీసా( US Visa ) కోసం ఎదురుచూస్తున్న వారికి షాకిచ్చేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.( President Donald Trump ) చిన్న చిన్న కారణాలకే వీసా దరఖాస్తును తిరస్కరిస్తున్నట్లుగా ఇప్పటికే వార్తలు వస్తున్నాయి.
ఈ పరిణామాలతో అమెరికాలో ఉంటున్న విదేశీయులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు తమకు తెలిస్తే కఠిన చర్యలు ఉంటాయని.
దానికి బదులు సీబీపీ యాప్ ద్వారా స్వచ్ఛందంగా అమెరికాను వీడితే భవిష్యత్తులో మరోసారి అగ్రరాజ్యంలో అడుగుపెట్టడానికి వీలు కల్పిస్తామని చెబుతున్నారు అధికారులు.

తాజాగా అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.సోషల్ మీడియాలో యూదు వ్యతిరేక పోస్టులు పెట్టినట్లు తేలింది అలాంటి వారికి వీసాలు ఆమోదించబోమని హెచ్చరించింది.ఈ నిబంధన తక్షణం అమల్లోకి వస్తుందని.
స్టూడెంట్ వీసాలు( Student Visa ) సహా అన్ని కేటగిరీల వీసా దరఖాస్తుదారులు, వారి సోషల్ మీడియా ఖాతాలపై నిఘా ఉంచుతున్నామని యూఎస్ వలస సేవల సంస్థ తేల్చిచెప్పింది.అలాగే అమెరికా ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించిన హమాస్, పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్, హెజ్‌బొల్లా, హూతీలకు మద్ధతు ఇస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది అమెరికా.

ఇప్పటికే అమెరికా వీసా కలిగి ఉన్న వారు ఉగ్రవాద సంస్థలకు, ఉగ్రవాద సానుభూతిపరులకు మద్ధతుగా పోస్ట్ పెడితే వారి నివాస హోదా రద్దవుతుందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి ట్రికియా మెక్‌లాప్లిన్( Tricia McLaughlin ) వెల్లడించారు.ఇక విద్యాసంస్థలు, యూనివర్సిటీలలో నిరసనలు, ఆందోళనల్లో పాల్గొన్న విదేశీ విద్యార్ధులకు ఇప్పటికే నోటీసులు వెళ్లిన సంగతి తెలిసిందే.ఆందోళనల్లో పాల్గొన్నవారే కాకుండా ఈ సంఘటలను వీడియోలు, ఫోటోల రూపంలో సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన వారు కూడా దేశం నుంచి వెళ్లిపోవాలంటూ ఈ మెయిల్స్ పంపింది ట్రంప్ యంత్రాంగం.విద్యార్ధుల గుర్తింపులో సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తోంది.
హమాస్ ఉగ్రవాదులకు మద్ధతుగా నిలుస్తున్న విదేశీ విద్యార్ధులను గుర్తించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ ఉపయోగిస్తోంది.