భారతీయ పర్యాటకులకు గాలం వేస్తోన్న ఆస్ట్రేలియా .. పెద్ద టార్గెట్టే!

భారతీయులు విదేశాలకు ప్రయాణాలు చేయడం పెరుగుతున్నందున ఆయా దేశాలు భారతీయ మార్కెట్‌ను ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.పెరుగుతున్న ఎయిర్ కనెక్టివిటీ, బలమైన ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ఆన్‌లైన్ వీసా ప్రక్రియ తమకు కలిసొస్తుందని ఆస్ట్రేలియా పర్యాటక శాఖ భావిస్తోంది.2024లో ఆష్ట్రేలియాకు వెళ్లే భారతీయ పర్యాటకుల సంఖ్య ఏడాదికి 12 శాతం పెరిగి 4,43,000లకు చేరుకుంది.అయితే భారతీయ పర్యాటకుల ఖర్చు 17 శాతం పెరిగింది.

 Tourism Australia Aims To Continue This Double Digit Growth Momentum From Indian-TeluguStop.com

టూరిజం ఆస్ట్రేలియాలో ఇండియా , గల్ఫ్ కంట్రీ మేనేజర్ నిశాంత్ కాశికర్ ( Manager Nishant Kashikar )మాట్లాడుతూ భారతీయ పర్యాటకుల ఊపును ఇంకా కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు.

గతేడాది ఆస్ట్రేలియాలో భారతీయ ప్రయాణీకులు గడిపిన రాత్రుల సంఖ్య కూడా దాదాపు 34 శాతం పెరిగింది.

దేశంలోని కీలక నగరాలను దాటి భారతీయులు ప్రయాణిసస్తున్నారని నిశాంత్ తెలిపారు.గతంలో ఎవరూ వినని టాస్మానియా , కాన్‌బెర్రా వంటి సుదూర గమ్యస్థానాలకు భారతీయుల తాకిడి పెరిగిందని చెప్పారు.

ఆస్ట్రేలియా, భారతదేశం మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలం అన్ని సమయాల్లోనూ బాగుందన్నారు.విమానయాన సామర్ధ్యం ఒక సవాలు కాదని, ఆస్ట్రేలియాకు ప్రయాణించడానికి వీసా పొందడం కూడా ఒక సమస్య కాదన్నారు.

సరళీకృత వీసా ప్రక్రియ పర్యాటక సంఖ్యను పెంచడానికి ఖచ్చితంగా సహాయపడుతుందని కాశీకర్ పేర్కొన్నారు.

Telugu Australian Visa, Canada, Europe, Indians, Managernishant, Visa-Telugu Top

ఆస్ట్రేలియా వీసా( Australian visa ) కోసం బయోమెట్రిక్స్, వ్యక్తిగత ఇంటర్వ్యూలు అవసరం లేదని.పాస్‌పోర్ట్‌తో పాటు ఎలాంటి పత్రాలను భౌతికంగా సమర్పించాల్సిన అవసరం లేదని మొత్తం ప్రక్రియ డిజిటల్‌గా నిర్వహించబడుతుందని కాశీకర్ తెలిపారు.వీసా నిబంధనలను సడలించడం ద్వారా భారతీయులను ఆకర్షించాలని చూస్తున్న దేశాలలో యూరప్, యూకే, యూఎస్, కెనడా వంటి దేశాల వీసా ప్రక్రియలకు విరుద్ధంగా ఆన్‌లైన్ వీసా ప్రక్రియ ఆస్ట్రేలియాకు కలిసొస్తుందని నిపుణులు అంటున్నారు.

Telugu Australian Visa, Canada, Europe, Indians, Managernishant, Visa-Telugu Top

భారత్ – ఆస్ట్రేలియా మధ్య విస్తరిస్తున్న ఎయిర్‌ కెనెక్టివిటీ కూడా పర్యాటక రంగానికి ప్రోత్సాహకంగా మారింది.ఎయిర్ ఇండియా, క్వాంటాస్ రెండూ డైరెక్ట్ విమానాలను ప్రారంభించడంతో ఈ మార్గంలో ప్రయాణికుల సంఖ్య పెరగడానికి ఓ కారణంగా ఆస్ట్రేలియా టూరిజం చెబుతోంది.భారతీయ విమానయాన సంస్ధలు ఇండిగో, ఎయిర్ ఇండియాలు ఆర్డర్ చేసిన కొత్త విమానాలు కూడా రంగంలోకి దిగితే ఆస్ట్రేలియాకు బూమ్ పెరుగుతుందని అంచనా వేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube