స్ట్రాబెర్రీలు.అద్భుతమైన పండ్లలో ఇవి ఒకటి.చూసేందుకు అందంగా, తినేందుకు రుచికరంగా ఉండటమే కాదు.స్ట్రాబెర్రీ పండ్లలో ఆరోగ్యానికి ఉపయోగపడే బోలెడన్ని పోషకాలు కూడా నిండి ఉంటాయి.ముఖ్యంగా బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారికి స్ట్రాబెర్రీలు అద్భుతంగా సహాయపడతాయి.అవును, ఇప్పుడు చెప్పబోయే విధంగా స్ట్రాబెర్రీలతో స్మూతీ తయారు చేసుకుని తీసుకుంటే సూపర్ ఫాస్ట్‌గా వెయిట్ లాస్ అవుతారు.
మరి ఇంకెందుకు ఆలస్యం అసలు మ్యాటర్‌లోకి వెళ్లిపోదాం పదండీ.
ముందుగా నీటిలో శుభ్రంగా కడిగిన నాలుగు స్ట్రాబెర్రీ పండ్లను తీసుకుని కాడలు, గింజలుతొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
అలాగే ఒక అరటి పండును పీల్ తొలగించి స్లైసెస్‌గా కట్ చేయాలి.మరోవైపు ఒక చిన్న గిన్నెలో పది జీడిపప్పులు, వాటర్ వేసి గంట పాటు నానబెట్టుకోవాలి.
ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో స్ట్రాబెర్రీ ముక్కలు, అరటి పండు స్లైసెస్, నాన బెట్టుకున్న జీడిపప్పులు, ఒక కప్పు ఆల్మండ్ మిల్క్ వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.

ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక బౌల్ తీసుకుని.సన్నగా తరిగిన స్ట్రాబెర్రీ ముక్కలు, అరటి పండు ముక్కలు, రెండు టేబుల్ స్పూన్ల సబ్జా గింజలు(నానబెట్టినవి), ఒక టేబుల్ స్పూన్ బాదం పలుకులు వేసి బాగా కలుపుకుంటే స్మూతీ సిద్ధం అవుతుంది.దీనిని బ్రేక్‌ఫాస్ట్ సమయంలో గనుక తీసుకుంటే అతి ఆకలి తగ్గుతుంది.
చిరు తిండ్లపై మనసు మల్లకుండా ఉంటుంది.ఫలితంగా వెయిట్ లాస్ అవుతారు.
అంతే కాదు, ఈ స్ట్రాబెర్రీ స్మూతీని తీసుకోవడం వల్ల రోజంతా యాక్టివ్‌గా ఉంటారు.క్యాన్సర్, మధుమేహం వంటి వ్యాధులు దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.
దంతాలు దృఢంగా, ఆరోగ్యంగా మారతాయి.రక్తపోటు స్థాయిలు అదుపు తప్పకుండా ఉంటాయి.
మెదడు పని తీరు చురుగ్గా మారుతుంది.మరియు కీళ్ల నొప్పుల నుంచి సైతం ఉపశమనం పొందొచ్చు.







