టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పర్చుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి.
కేవలం రీల్ లైఫ్ లో మాత్రమే కాకుండా రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకున్న వ్యక్తి చిరంజీవి.మెగాస్టార్ చిరంజీవి డెడికేషన్ గురించి, కష్టపడే తత్వం గురించి అందరికి తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవి డెడికేషన్ తో ఇప్పటివరకు దాదాపుగా 150 సినిమాల్లో నటించారు.చిరంజీవికి సినిమాల పట్ల ఉన్న డెడికేషన్, అభిమానం ఫ్యాషన్ గురించి మనందరికీ తెలిసిందే.
షూటింగ్ ఉంది అంటే చాలు చిరంజీవి రాత్రి పగలు తేడా లేకుండా పని చేస్తూ ఉంటారు.అంతేకాకుండా పర్ఫామెన్స్ లో ది బెస్ట్ ఇచ్చేవరకు ప్రయత్నిస్తూనే ఉంటారు.
ఆ తరం ప్రేక్షకుల నుంచి ఈ తరం ప్రేక్షకుల వరకు రెండు తరాల ప్రేక్షకులను అలరిస్తూ ఎంతో మంది యువ తరం హీరోలకు ఇన్స్పైర్ నిలుస్తున్నారు చిరంజీవి.ఈ ఏజ్ లో కూడా చిరంజీవి ఏ మాత్రం తగ్గకుండా అదే ఊపుతో సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు.
ఇకపోతే ప్రస్తుతం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.చిరంజీవిని ఆనాడే అంచనావేసి అల్లు రామలింగయ్య తన ఇంటి అల్లుడిని చేసుకున్నాడు.
ఇదిలా ఉంటే తాజాగా మెగాస్టార్ చిరంజీవి డెడికేషన్ గురించి హీరో వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

చిరంజీవి ప్రస్తుతం మూడు సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే.సాధారణంగా ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు షూటింగ్ చేయడం చాలా కష్టం.ప్రస్తుతం హీరో టైమింగ్ కూడా అదే.అయితే ఆ టైం లోనే చాలా అలసిపోయి ఇంటికి వచ్చేసరికి టైడ్ గా అన్ ఈజీగా అనిపిస్తుంది అని తెలిపాడు వరుణ్ తేజ్. కానీ పెదనాన్న మాత్రం రెండు వారాల క్రితం ఒకే రోజులో మూడు సినిమా షూటింగ్ లకు హాజరయ్యారు.

సినిమా షూటింగ్ పూర్తి చేసి వచ్చి ఒక గంట విశ్రాంతి తీసుకుని అనంతరం హైదరాబాద్ విమానంలో తిరిగి వచ్చి ఇంట్లో భోజనం చేసి మరొక షూటింగ్ కి బయలుదేరారు.కేవలం ఒకరోజు పెదనాన్న 3 గంటలు మాత్రమే నిద్రపోయారు అని మెగాస్టార్ చిరంజీవి డెడికేషన్ గురించి చెప్పుకొచ్చాడు వరుణ్ తేజ్.అయితే మెగాస్టార్ కు ఈ వయసులో అంత కష్టపడాల్సిన పని లేదని, కానీ మెగాస్టార్ మాత్రం కష్టపడుతూనే ఉన్నారు.అలాంటి వ్యక్తి నాకు నిజంగా ఎంతో స్ఫూర్తి అని తెలిపారు వరుణ్ తేజ్.







