మధుమేహం( diabetes ) బారిన పడ్డవారికి షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచుకోవడం అనేది కత్తి మీద సాముల మారుతుంటుంది.అయితే కొన్ని కొన్ని ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో అద్భుతంగా సహాయపడతాయి.
కాకరకాయ ఆకులు కూడా ఆ కోవకే చెందుతాయి.అవును, మీరు విన్నది నిజమే.
కాకరకాయ మాత్రమే కాదు కాకరకాయ ఆకులు కూడా ఆరోగ్యపరంగా మనకు ఎంతో మేలు చేస్తాయి.మరియు ఆయుర్వేదంలో విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి.
కాకరకాయ ఆకుల్లో( leaves of bitter gourd ) యాంటీ డయాబెటిక్ గుణాలు ఉంటాయి.మధుమేహం ఉన్నవారు కాకరకాయ ఆకులను నీటిలో మరిగించి కషాయం తయారు చేసుకుని నిత్యం తాగితే చాలా మంచిది.
కాకరకాయ ఆకుల కషాయం రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించడంలో తోడ్పడుతుంది.షుగర్ ను మీ కంట్రోల్ లోకి తెస్తుంది.అలాగే లివర్ డిటాక్సిఫికేషన్ కు కాకరకాయ ఆకులు సహాయపడతాయి.కాకరకయ కషాయాన్ని వారానికి కనీసం రెండు సార్లు తీసుకుంటే ఫ్యాటీ లివర్, లివర్ డ్యామేజ్ ( Fatty liver, liver damage )వంటి సమస్యలకు దూరంగా ఉంటారు.
లివర్ ఫంక్షన్ మెరుగుపడుతుంది.

కాకరకాయ ఆకుల్లో ఫైటోకెమికల్స్( Phytochemicals ) ఉంటాయి.ఇవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను సమర్థవంతంగా కరిగిస్తాయి.హై బీపీ, గుండె జబ్బులు వచ్చే ముప్పును తగ్గిస్తాయి.
కీళ్ల నొప్పులు మరియు ఒళ్లు నొప్పులతో బాధపడుతున్న వారికి కాకరకాయ ఆకులు ఔషదంలా పని చేస్తాయి.కాకరకాయ ఆకుల కషాయం తయారు తీసుకుంటే శరీరంలో వాపు తగ్గుతుంది.
నొప్పులన్ని మటుమాయం అవుతాయి.

అంతేకాదండోయ్.కాకరకాయ ఆకుల కషాయం గ్యాస్, అజీర్ణం మరియు ఇతర జీర్ణ సమస్యలను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది.కాకరకాయ ఆకుల్లో ఉండే శక్తివంతమైన యాంటీ-ఆక్సిడెంట్లు శరీరంలో టాక్సిన్స్ ను తొలగిస్తాయి.
ఇన్ఫెక్షన్లు, వైరల్ ఫీవర్ నుంచి త్వరగా రికవరీ అయ్యేందుకు కూడా సహకరిస్తాయి.ఇక కాకరకాయ ఆకులను కషాయంగా తయారు చేసుకోవచ్చు.
సూప్ తయారు చేసుకోవచ్చు.లేదా కాకరకాయ ఆకులను పప్పులో కలిపి వండుకుని కూడా తినొచ్చు.
ఎలా తీసుకున్నా ఆరోగ్యమే.