అల్లు అర్జున్ మాకు నరకం చూపించాడు... కొరియోగ్రాఫర్ సంచలన వ్యాఖ్యలు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) తాజాగా పుష్ప 2 ( Pushpa 2 ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక ( Rashmika ) హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద 1800 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది.

 Ganesh Master Sensational Comments On Allu Arjun , Allu Arjun, Ganesh Master, Pu-TeluguStop.com

ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తన తదుపరి సినిమా అట్లీ డైరెక్షన్లో చేయబోతున్నారని తెలుస్తోంది.ఇక పుష్ప సినిమాలో పాటలు కూడా ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయి.

Telugu Allu Arjun, Alluarjun, Ganesh Master, Pushpa, Tollywood-Movie

ముఖ్యంగా గంగమ్మ జాతరలో గంగో రేణుక తల్లి,సూసకి అగ్గి రవ్వమాదిరి వంటి పాటలు ఈ సినిమాకు హైలైట్ గా నిలిచాయి.ఇక పాటలకు అల్లు అర్జున్ డాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా అదిరిపోయిందని చెప్పాలి అయితే ఈ రెండు పాటలకు కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ ( Ganesh Master ) కొరియోగ్రఫీ చేశారు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూలో భాగంగా గణేష్ మాస్టర్ అల్లు అర్జున్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.అల్లు అర్జున్ ఈ పాటలకు ప్రాక్టీస్ చేయడం కోసం చాలా కష్టపడ్డారని తెలిపారు.

Telugu Allu Arjun, Alluarjun, Ganesh Master, Pushpa, Tollywood-Movie

ముఖ్యంగా గంగో రేణుక పాటన షూట్ చేయడం కోసం దాదాపు 29 రోజులపాటు టీమ్ మొత్తం కష్టపడ్డామని తెలిపారు.ఇక ఈ పాటలో నటించడం కోసం అల్లు అర్జున్ కూడా అదే స్థాయిలో రిహార్సల్స్ చేశారని తెలిపారు.ఈ పాట షూటింగ్ సమయంలో అల్లు అర్జున్ కు కాలికి గాయం అయినప్పటికీ ఆయన మాత్రం వెనకడుగు వేయకుండా ప్రాక్టీస్ చేస్తూనే షూటింగ్స్ లో పాల్గొంటూనే ఉన్నారు.ఆయన కాలికి దెబ్బ తగిలినప్పటికీ కూడా మమ్మల్ని వదిలిపెట్టలేదు.

ఈ పాట చిత్రీకరణ ఎలాగైనా పూర్తి చేయాల్సిందే అని పట్టుబట్టి మరీ మాకు కూడా నరకం చూపించాడు.ఇక అల్లు అర్జున్ డెడికేషన్ కి హ్యాట్సాఫ్ అనాల్సిందే అంటూ గణేష్ మాస్టర్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube