గుడిలో పూజ చేసేటప్పుడు పురుషులు షర్టు ఎందుకు ధరించకూడదు?

హిందూ సంప్రదాయాల ప్రకారం గుడికి వెళ్లడం.దేవుడికి పూజలు చేయడం అందరికీ తెలిసన విషయమే.

 Why Should Not Men Wear Shirts While Doing Puja In The Temple, Devotional, Mens-TeluguStop.com

అంతే కాకుండా పండుగలు, పబ్బాలు, పూజలు, వ్రతాలప్పుడు కూడా మనమంతా దేవుడిని మెప్పించేందుకు ఎంతగానో ప్రయత్నిస్తుంటాం.అయితే ఈ క్రమంలోనే మనం ఎన్నెన్నో ఆచారాలు పాటిస్తూ ఉంటాం.

అయితే దేడుడికి పూజలు చేసేటప్పుడు పురుషులు షర్టు వేసుకోకూడదని చెబుతుంటారు.అంతే కాదు చాలా ఆలయాల్లో పురుషులకు షర్టు ఉంటే గర్భగుడిలోకి రానివ్వరు.

అసలు దేవాలయ ప్రవేశం చేసే పురుషులు ఛాతీ భాగంలో వస్త్రాలు ఎందుకు ధరించకూడదో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

పురుషులు పూజ చేసేటప్పుడు లేదా ఆలయాల్లోకి వెళ్లేటప్పుడు ఛాతీ భాగంలో వస్త్రం ధరించకూడదని మన పెద్దలు చెబుతుంటారు.

కొన్ని దేవాలయాల్లో ఈ ఆచారం తప్పని సరిగా పాటించబడుతోంది.ఆలయంలోకి ప్రవేశించే భక్తుడు భగవంతుడి కృప తనపై ప్రసరించాలని కోరుకుంటాడు.

దేవుని ముందు చేతులు జోడించి నిలచిన భక్తునిపై దేవుడి కృప ప్రవేశిస్తుందని భక్తుల నమ్మకం.ఇది మానసికి భావనే కాక శారీరక భావన కూడా.

విగ్రహంలోని ప్రతీ భాగం నుండి వెలువడుతున్న శక్తి కిరణాలు భక్తుడిలో నేరుగా ప్రవేశిస్తాయి.కావున నడుము నుంచి తలభాగం వరకు నగ్నంగా ఉండాలని పెద్దలు సూచిస్తారు.

దేవాలయంలోని దేవతా విగ్రహాన్ని దర్శించబోయే బక్తుడు తడి మడి బట్టను కట్టుకొని ఉండటం వల్ల భగవత్ కటాక్షం ఇంకా ఎక్కువగా ఉంటుంది.కానీ స్త్రీలకు ఈ నియమం వర్తించదు.

స్త్రీ యొక్క మాతృత్వాన్ని ఎంతో గౌరవేచే భారతీయులు వారికి ఇబ్బందిని కల్గించే ఈ ఆచారాన్ని పాటించమని చెప్పలేదు.అలాగే సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో స్నానం తర్వాత మన దేహాన్ని సూర్య కిరణాలలో ఉండే డి విటామిన్ శరీరానికి పుష్కలంగా లభిస్తుంది.

ఇలాంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొనే పురుషులు పై వస్త్రాన్ని ధరించకుండా దేవాలయంలోకి ప్రవేశించాలని చెప్పడం జరిగింది.

Why Should Not Men Wear Shirts While Doing Puja In The Temple

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube