తెలుగు సినిమా పరిశ్రమలో పరిచయం అవసరం లేని వ్యక్తి మోహన్ బాబు.కలెక్షన్ కింగే కాదు.క్రమశిక్షణకు మారుపేరు ఆయన.ఆయన అంటే సినిమా పరిశ్రమలో చాలా మందికి భయం.ఆయన మనసులో ఏదీ దాచుకోలేడు.కోపం వస్తే.
ఉన్నది ఉన్నట్లు బయటకు కక్కేస్తాడు.అందుకే మోహన్ బాబుతో పెట్టుకోరు.
నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఆయన విలన్ గా, హీరోగా, నిర్మాతగా ఎన్నో రోల్స్ పోషించాడు.రాజకీయంగా కూడా ఆయనకు మంచి పలుకుబడి ఉంది.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పెద్దలతో మంచి సంబంధాలున్నాయి.
ఎస్ ఎస్ రాజమౌళి.
తెలుగు సినిమా పరిశ్రమ సత్తాను ప్రపంచానికి చాటిన వ్యక్తి.బాహుబలి సినిమాతో తెలుగు సినిమా అంటే ఎలా ఉంటుందో చూపించాడు.
ఆయనతో ఒక్కసినిమా అయినా చేయాలి అనుకుంటారు నటీనటులు.స్టార్ హీరోలు సైతం ఆయనతో సినిమాలు చేసేందుకు రెడీ అవుతారు.
ఈ నేపథ్యంలో తన పెద్దకొడుకు విష్ణుతో ఒక సినిమా చేయాలిన అప్పట్లో మోహన్ బాబు కోరాడట.

ఆ సమయంలో రాజమౌళి హిట్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు.సింహాద్రి, విక్రమార్కుడు, ఛత్రపతి, యమదొంగ లాంటి సినిమాలతో దుమ్మురేపుతున్నాడు.ఆ సమయంలో విష్ణుతో సినిమా చేస్తే.
విష్ణు కెరీర్ బాగుంటుంది అనుకున్నాడు.కానీ సమయం వచ్చినప్పుడు తనతో సినిమా చేస్తానని.
ఏదో ఒక కథతో ఇప్పుడు సినిమా చేయడం తనకు ఇష్టం లేదని చెప్పాడట రాజమౌళి.

అప్పుడు మోహన్ బాబు ఫీలయ్యాడట.ఇండస్ట్రీలో తాను ఎవరిని ఏం అడిగినా కాదనరని. రాజమౌళి సినిమాను చేయలేనని చెప్పడం తనకు బాధ కలిగించింది.
అయితే వాస్తవానికి విష్ణుతో సినిమాను చేయకూడదు అని తను అనుకోలేదు.ఆయనకు తగిన కథ వచ్చినప్పుడు తప్పకుండా చేయాలి అనేది రాజమౌళి ఉద్దేశం.
మోహన్ బాబుబు మాత్రం మరోలా ఆలోచించాడు.విష్ణుకు మంచి హిట్ సినిమా వస్తే.
కెరీర్ బాగుటుంది అని భావించాడు.అయితే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యమదొంగ సినిమాలో మోహన్ బాబు యముడి క్యారెక్టర్ చేసి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు.