కర్ణాటక రాజధాని బెంగళూర్‌లో ఓ దారుణం వెలుగు చూసింది.బెంగళూరు నగరంలో ఒక యువకుడు స్కూటర్‌పై వెళ్తూ ఒక వృద్ధుడి కారుకు డాష్ ఇచ్చాడు.
అంతేకాదు, ఆ పెద్దాయనను తన స్కూటర్ తో ఈడ్చుకెళ్లాడు.ఈ షాకింగ్ దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దీన్ని చూసిన నెటిజన్లు అతడిపై ఫైర్ అవుతున్నారు.
వివరాల్లోకి వెళితే.
జనవరి 17న బెంగళూర్ లో ఒక రహదారిపై ముత్తయ్య అనే 71 ఏళ్ల వృద్ధుడు కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు.అలా వెళుతుండగా అటుగా స్కూటర్‌పై వెళ్తున్న ఒక వ్యక్తి కారును ఢీ కొట్టాడు.
వెంటనే కారును ఆపి ఆ యువకుడిని పట్టుకునేందుకు ముత్తయ్య ప్రయత్నించాడు.ఇందులో భాగంగా స్కూటర్ వెనుక భాగాన్ని గట్టిగా పట్టుకున్నాడు.

అయితే ఆ యువకుడు తన స్కూటర్ ఆపకుండా తప్పించుకునేందుకు రైసింగ్ ఇచ్చాడు.ఆపై ఆ ముసలాయనను తన స్కూటర్ తో పాటే బెంగళూరు రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు.ఈ దారుణానికి పాల్పడ్డ యువకుడి పేరు సాహిల్. పట్టపగలు నడిరోడ్డుపై ఇలాంటి దారుణం కళ్ళముందే కనిపిస్తుండటంతో వెనకే వస్తున్న ఒక బైకర్ ఇది చూసి చలించిపోయాడు.అనంతరం వీడియో తీయడం స్టార్ట్ చేశాడు.

ఆపై ఇది యువకుడిని ఆపి వృద్ధుడిని కాపాడాడు.దాంతో ఆ వృద్ధుడి ప్రాణాలు బతికిపోయాయి.దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో పోలీసులు స్పందించారు.
స్కూటర్ బొలెరో కారును ఢీకొట్టిన తర్వాత ఈ దారుణం చోటుచేసుకుందని డీసీసీ లక్ష్మణ్ నిర్బర్గి వెల్లడించారు.స్కూటర్ రైడర్ ని ఇమీడియట్‌గా అరెస్టు చేశామన్నారు.
ఈడ్చుకెళ్లబడిన వృద్ధుడికి చాలా గాయాలయ్యాయని తెలిపారు.







