నోకియా నుంచి ఇండియాలో కొత్త ట్యాబ్లెట్ లాంచ్.. ధర ఎంత తక్కువో తెలిస్తే..?

నోకియా ఫోన్ల తయారీ కంపెనీ హెచ్‌ఎండీ గ్లోబల్ తాజాగా ఇండియాలో కొత్త నోకియా T21 ట్యాబ్లెట్ విడుదల చేసింది.ఈ ట్యాబ్లెట్ 10.3-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది.నోకియా T20 బాగా అమ్ముడుపోవడంతోనే కొత్త Nokia T21 తీసుకొచ్చామని కంపెనీ తెలిపింది.

 Nokia T21 Tablet Launched In India Know Price And Specifications Details, Nokia,-TeluguStop.com

ఈ కొత్త ట్యాబ్లెట్ లాంగ్ లైఫ్ బ్యాటరీ, నార్మల్ సాఫ్ట్‌వేర్, సెక్యూరిటీ అప్‌డేట్లు, ప్రీమియం యూరోపియన్-బిల్ట్ ఎక్స్‌పీరియన్స్‌తో అందుబాటులోకి రానుంది.

కొత్త టాబ్లెట్ నోకియా T21 జనవరి 22 నుంచి రిటైల్ స్టోర్లు, ప్రముఖ అవుట్‌లెట్లలో అందుబాటులో ఉంటుంది.నోకియా T21 వై-ఫై వేరియంట్‌ ధర రూ.17,999, ఎల్‌టీఈ+ వై-ఫై వేరియంట్‌ ధర రూ.18,999గా కంపెనీ నిర్ణయించింది.కొనుగోలుదారులు నోకియా.

కామ్‌లో ప్రీ-బుక్ చేయవచ్చు.రూ.1,000 ప్రీ-బుకింగ్ డిస్కౌంట్ పొందవచ్చు.నోకియా T21 ట్యాబ్లెట్ 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో లాంచ్ అయ్యింది.

అలాగే ఇది ఒకే ఒక కలర్ ఆప్షన్స్ తో వస్తుంది.ఇది చార్‌కోల్ గ్రే రంగులో వస్తుంది.T21 టాబ్లెట్ A ఫ్లాష్‌తో 8MP బ్యాక్‌సైడ్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.కొత్త ట్యాబ్లెట్ 8200mAh బ్యాటరీతో చాలా సమయం పాటు బ్యాకప్ ఇస్తుంది.800 ఛార్జింగ్ సైకిల్స్ తర్వాత కూడా 80 శాతం సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

అంతేకాకుండా, ఇది SGS తక్కువ బ్లూ లైట్ సర్టిఫికేషన్‌తో 10.36-అంగుళాల 2K డిస్‌ప్లేతో వస్తుంది.బిగ్ స్క్రీన్ పై వీడియో కంటెంట్ చూసేందుకు ఈ నోకియా T21 ట్యాబ్లెట్ బాగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.

ఎక్కువ బ్యాటరీ లైఫ్ వల్ల గంటలపాటు సినిమాలు చూసే వారికి కూడా ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube