1.రాహుల్ పాదయాత్ర
కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత జోడో యత్ర తెలంగాణలో సాగుతోంది.అల్లాదుర్గం మండలం నుంచి ఈరోజు రాహుల్ పాదయాత్ర ప్రారంభమైంది.
2.ప్రపంచ పర్యాటక ప్రదర్శనలో తెలంగాణ స్టాల్
లండన్ లోని ఎక్స్టెల్ సెంటర్ లో సోమవారం నుంచి బుధవారం వరకు నిర్వహించనున్న ప్రపంచ పర్యాటక సదస్సులో తెలంగాణ పర్యాటక సంస్థ ఒక ప్రత్యేక స్టాల్ ను ఏర్పాటు చేయనుంది.
3.నేడు ఎం డి ఎస్ వెబ్ కౌన్సిలింగ్
ఎం డి ఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల ఆరవ తేదీన రెండో విడత వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది.
4.సకల జనుల సమ్మె పై ఆర్టీసీ కీలక నిర్ణయం
స్పెషల్ క్యాజువల్ లీవ్ గా సకల జనుల సమ్మె పేరుతో అప్పట్లో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె కాలాన్ని నమోదు చేయనున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది.
5.క్షయ రోగులకు పౌష్టికాహార కిట్ లు
దాతల సహకారంతో క్షయరోగులకు పౌష్టికాహార కిట్లను పంపిణీ చేయనున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రకటించారు.
6.డిస్కంలకు 1,382 మిలియన్ యూనిట్ల నష్టం
తెలంగాణలో విద్యుత్ పంపిణీ వ్యవస్థ ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ కు 3 నెలల కాలంలో 1382 మిలియన్ యూనిట్లు నష్టపోయినట్లు ఆడిట్ నివేదికలో బయటపడింది.
7.టెక్నాలజీ స్టార్ట్ అప్ లకు కేంద్రంగా టీ హబ్
రాష్ట్రంలో టెక్నాలజీ స్టార్తప్ లకు టీ హబ్ కేంద్రంగా నిలుస్తోందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.
8.శ్రీవారి సేవలు ఏపీ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు
తిరుమల శ్రీవారిని ఏపీ, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు దర్శించుకున్నారు.ఏపీ హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజేశ్వరరావు దర్శించుకున్నారు
9.ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరొకరి అరెస్ట్
ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పిఎ దేవేంద్ర శర్మను ఈడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
10.సినిమా నుంచి విస్వక్ సేన్ ను తప్పించిన అర్జున్
దర్శక నిర్మాతగా అర్జున్ నిర్మిస్తున్న సినిమాలో హీరోగా ఉన్న విశ్వక్ సేన్ ను తప్పించినట్లుగా అర్జున్ ప్రకటించారు.అంతేకాకుండా ఆయనపై నిర్మతల మండలికి ఫిర్యాదు చేయనున్నట్లు అర్జున్ తెలిపారు.
11.చంద్రబాబుపై రోజా కామెంట్స్
టిడిపి అధినేత చంద్రబాబు కళ్ళు ఉన్న కబోది అంటూ ఏపీ మంత్రి ఆర్కే రోజు విమర్శించారు.
12.శ్రీవారి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేసిన టీటీడీ
తిరుమల శ్రీవారి ఆస్తుల పై శ్వేత పత్రాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మ రెడ్డి విడుదల చేశారు.
13.పవన్ కళ్యాణ్ వ్యవహారంపై టిడిపి కామెంట్స్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హత్యకు 250 కోట్ల సుఫారీ ఇచ్చారని టిడిపి కీలక నేత బోండా ఉమా సంచలన ఆరోపణలు చేశారు.
14.కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
దేశవ్యాప్తంగా ఆరు నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల ఓటింగ్ పలితాల లెక్కింపు ఈరోజు జరుగుతోంది.
15.విఐపి దర్శనం బ్రేక్ లలో మార్పు : టీటీడీ
వచ్చే నెల 1 నుంచి వీఐపీ దర్శనంకు ఉదయం 08 నుంచి 12:00 వరకు అవకాశం కల్పిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
16.భోగాపురానికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేయడం లేదు
ఈనెల 11న భోగాపురం ఎయిర్ పోర్ట్ కు ప్రధాని నరేంద్ర మోది శంకుస్థాపన చేయడం లేదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
17.బిజెపి, టిఆర్ఎస్ పై రాహుల్ విమర్శలు
బిజెపి, టీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్కరు సంతోషంగా లేరని కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ విమర్శించారు.భారత్ జోడో యాత్రలో భాగంగా ఆయన చేపట్టిన పాదయాత్రలో ఈ వ్యాఖ్యలు చేశారు.
18.భారత క్షిపణి పరీక్ష వాయిదా
మహాసముద్రంలోకి ప్రవేశించిన చైనా నిఘానౌక కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు భారత నౌకాదళం ప్రకటించింది.చైనా నిఘా నౌక హిందూ మహాసముద్రంలో ప్రవేశించిన నేపథ్యంలో భారత శకుని పరీక్షను వాయిదా వేసినట్లు ప్రకటించింది.
19.ప్రధాని సభ పై సంజయ్ వ్యాఖ్యలు
ఈనెల 12వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోది రాక సందర్భంగా ఏర్పాటు చేస్తున్న సభకు భారీగా జన సమీకరణ చేపట్టి సభ దద్దరిల్లేలా చేయాలని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,000 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 51,280
.