టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న విలన్లలో సోనూసూద్( Sonu Sood ) ఒకరనే సంగతి తెలిసిందే.సీఎం, డిప్యూటీ సీఎం, రాజ్యసభ సభ్యుడిగా పని చేసే ఛాన్స్ వచ్చినా తాను రిజెక్ట్ చేశానని సోనూసూద్ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.
తాను ఆ పదవులను రిజెక్ట్ చేయడానికి గల కారణాలను సైతం సోనూసూద్ వెల్లడించారు.
దేశంలోని మంచి పేరున్న కొంతమంది నేను ముఖ్యమంత్రిగా( Chief Minister ) బాధ్యతలు స్వీకరించాలని ఛాన్స్ ఇచ్చారని సోనూసూద్ చెప్పుకొచ్చారు.
కానీ నేను ఆ ఆఫర్ ను తిరస్కరించానని సోనూసూద్ తెలిపారు.అందువల్ల నా ముందు ఇతర ఆఫర్లను సైతం ఉంచారని ఆయన పేర్కొన్నారు.పాలిటిక్స్ లో( Politics ) ఉంటే దేనికోసం మనం పోరాడాల్సిన అవసరం లేదని చెప్పారని సోనూసూద్ కామెంట్లు చేశారు.

అయితే వాళ్లు ఇచ్చిన అవకాశాలను తాను స్వీకరించలేకపోయానని సోనూసూద్ అన్నారు.పాలిటిక్స్ లోకి వస్తే పదవితో పాటు ఇల్లు, ఉన్నత స్థాయి భద్రత, ప్రభుత్వ ముద్రతో ఉన్న లెటర్ హెడ్ విలాసాలు ఉంటాయని కొంతమంది నాతో చెప్పారని ఆయన కామెంట్లు చేశారు.డబ్బు సంపాదించడం కోసం లేదా అధికారం కోసం చాలామంది పాలిటిక్స్ లోకి వస్తుంటారని సోనూసూద్ చెప్పుకొచ్చారు.

వాటి పట్ల నాకు ఆసక్తి లేదని ఆయన అన్నారు.ప్రజాసేవ చేయాలని అనుకుంటే నేను ప్రస్తుతం అదే పని చేస్తున్నానని సోనూసూద్ కామెంట్లు చేశారు.నేను ఎవరికైనా సొంతంగానే సహాయం చేస్తున్నానని దాని గురించి ఎవరినీ అడగడం లేదని పేర్కొన్నారు.ప్రస్తుతం నేను స్వేచ్చగా జీవిస్తున్నానని సాయం విషయంలో సైతం అలానే ఉంటానని ఆయన తెలిపారు.
ఒకవేళ నేను పొలిటికల్ లీడర్ గా మారితే జవాబుదారీతనంతో వ్యవహరించాలని అది నన్ను మరింత భయపెడుతుందని సోనూసూద్ కామెంట్లు చేశారు.సోనూసూద్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి.