బన్నీపై నాకెందుకు కోపం.. వాళ్లు నాతో తిరిగినవాళ్లే.. రేవంత్ రెడ్డి కామెంట్స్ వైరల్!

గత కొంతకాలంగా టాలీవుడ్ వర్సెస్ రేవంత్ రెడ్డి( Revanth Reddy ) అనే పరిస్థితి ఏర్పడగా ఈ పరిస్థితి మారే దిశగా అడుగులు పడుతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.బన్నీపై( Bunny ) రేవంత్ రెడ్డికి కోపం ఉందని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతున్న తరుణంలో బన్నీపై నాకెందుకు కోపం అంటూ రేవంత్ రెడ్డి కామెంట్లు చేశారు.

 Revanth Reddy Sensational Comments About Tollywood Details, Revanth Reddy, Cm Re-TeluguStop.com

రేవంత్ రెడ్డి ఇండస్ట్రీకి కావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకపోయినా తమ ప్రభుత్వానికి ఇండస్ట్రీకి గ్యాప్ లేదని తేల్చి చెప్పేశారు.

మరోవైపు రేవంత్ రెడ్డిని నాగార్జున( Nagarjuna ) కలవడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.

బన్నీపై నమోదైన కేసు విత్ డ్రా చేసుకునే ఛాన్స్ ఉందని భోగట్టా.అదే సమయంలో రేవతి తొక్కిసలాట వల్ల కాదు ఊపిరాడక మృతి చెందారనే వాదన సైతం తెరపైకి వస్తుండగా రాబోయే రోజుల్లో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది.

Telugu Allu Arjun, Alluarjun, Congress, Nagarjuna, Revanth Reddy, Revathi, Sandh

బన్నీపై తనకు కోపం ఎందుకు ఉంటుందని రేవంత్ రెడ్డి కామెంట్లు చేశారు.చరణ్, బన్నీ తనకు చిన్నప్పటి నుంచి తెలుసని వాళ్లు నాతో తిరిగిన వాళ్లేనని రేవంత్ రెడ్డి వెల్లడించారు.హాలీవుడ్, బాలీవుడ్ సైతం హైదరాబాద్ కు( Hyderabad ) వచ్చే దిశగా చర్యలు తీసుకుంటామని ఆయన కామెంట్లు చేశారు.సినిమా ఇండస్ట్రీని( Cinema Industry ) మరో స్థాయికి తీసుకెళ్లడంలో కృషి చేస్తానని రేవంత్ రెడ్డి వెల్లడించడం కొసమెరుపు.

Telugu Allu Arjun, Alluarjun, Congress, Nagarjuna, Revanth Reddy, Revathi, Sandh

సినిమా ఇండస్ట్రీకి మంచి చేయాలనే వారసత్వాన్ని తమ ప్రభుత్వం కొనసాగిస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరుపై నెటిజన్ల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.రేవంత్ రెడ్డి ఇండస్ట్రీకి మేలు చేసేలా తీసుకుంటున్న నిర్ణయాలను నెటిజన్లు సైతం మెచ్చుకుంటున్నారు.ఈ సమావేశంతో కాంగ్రెస్ సర్కార్ కు టాలీవుడ్ కు గ్యాప్ తగ్గినట్టేనని చెప్పవచ్చు.

రేవంత్ రెడ్డిపై నెటిజన్లు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తుండటం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube