నిత్యం పాలు తాగ‌డం వ‌ల్ల బ‌రువు పెరుగుతారా?

పాలు( milk ) ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.మ‌న శరీరానికి అవసరమైన పోషకాలు సమృద్ధిగా కలిగి ఉండ‌టం వ‌ల్ల చాలా మంది నిత్యం పాలు తాగుతుంటారు.

 Can You Gain Weight By Drinking Milk Regularly? Drinking Milk, Milk Health Benef-TeluguStop.com

అయితే పాలు తాగ‌డం వ‌ల్ల బ‌రువు పెరుగుతార‌ని కొంద‌రు నమ్ముతుంటారు.ఈ క్ర‌మంలోనే పాలును పూర్తిగా అవాయిడ్ చేస్తుంటారు.

అస‌లు నిజంగా పాలు తాగడం వల్ల బరువు పెరుగుతారా అంటే.అది ఎలా తాగుతారు, ఎన్ని పాలు తాగుతారు, మీ శరీర శ్రమ మరియు ఇతర ఆహార‌పు అలవాట్లపై ఆధారపడి ఉంటుంది.

ఫుల్ ఫ్యాట్ మిల్క్ అంటే అధిక కొవ్వు మరియు కేలరీలను క‌లిగి ఉంటాయి.రోజువారీ అవసరానికి మించి ఈ పాలును తాగితే బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి.

లో-ఫ్యాట్ మిల్క్( Low-fat milk ) అంటే తక్కువ కొవ్వు, తక్కువ కేలరీలు ఉంటాయి.ఇవి బరువు పెరగకుండా దారితీయ‌వు.అలాగే పాలను తగిన పరిమాణంలో తాగితే బరువు పెరగడం అనేది సాధారణంగా జరగదు.కానీ ఎక్కువగా తాగితే అధిక కేలరీలు శరీరంలో నిల్వగా మారి బరువు పెరగవచ్చు.

Telugu Milkregularly, Tips, Latest, Milk, Milk Benefits-Telugu Health

పాలలో చక్కెర లేదా ఇతర తీపి పదార్థాలు అన‌గా బాదం పౌడర్, చాక్లెట్ సిరప్ ( Almond powder, chocolate syrup )వంటివి కలిపితే కేలరీలు పెరుగుతాయి.ఇలా తాగే పాలు బరువు పెరగడంలో ప్రభావం చూపవచ్చు.పాలు తాగి శరీర శ్రమ చేయకుండా ఉంటే కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉంటుంది.వ్యాయామం చేసేవారు పాలు తాగితే అదనపు కేలరీలు బ‌ర్న్ అవుతారు.దాంతో బ‌రువు పెర‌గ‌డం అనేది జ‌ర‌గ‌దు.

Telugu Milkregularly, Tips, Latest, Milk, Milk Benefits-Telugu Health

బరువు పెరగకుండా ఉండాలంటే పరిమిత కొవ్వు పాలును ఎంచుకోవాలి.అలాగే రోజుకు ఒక‌టి లేదా రెండు గ్లాసుల పాలును మాత్ర‌మే తీసుకోవాలి.శ‌రీరానికి శ్ర‌మ ఉండేలా చూసుకోవాలి.

మ‌రియు సరైన ఆహార పద్ధతులు పాటించాలి.ఇక నిత్యం పాలు తాగడం వ‌ల్ల ఎముక‌లు, దంతాలు దృఢంగా మ‌రియు ఆరోగ్యంగా మార‌తాయి.

పాలలో ఉన్న ప్రోటీన్లు శరీర కండరాల పెరుగుదలకు మరియు శక్తి ఉత్పత్తికి దోహదపడతాయి.రక్తపోటు నియంత్రణకు, హృదయ ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డానికి పాలు అద్భుతంగా తోడ్ప‌డ‌తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube