ప్రముఖ టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్ అదితిరావు హైదరీ( Aditi Rao Hydari ), హీరో సిద్ధార్థ్ సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.వీరిద్దరూ వనపర్తి జిల్లాలోని రంగనాథ ఆలయంలో మార్చి 27న ఉదయం మ్యారేజ్ చేసుకున్నారట.
ఈ ఇద్దరికి ఇది మొదటి పెళ్లి మాత్రం కాదు.సిద్ధార్థ్( Siddharth ) చాలామంది హీరోయిన్లను నమ్మించి మోసం చేశాడని విమర్శలు ఉన్నాయి.
అదితిరావు అచ్చ తెలుగమ్మాయి.ఆమె గోవా, దుబాయ్ వంటి వేరే సిటీలలో కాకుండా వనపర్తి జిల్లాలోని ఓ చిన్న గుడిలో పెళ్లి చేసుకోవడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది.
అదితిరావు తన మూలాలను మర్చిపోలేదు.శ్రీరంగాపురం రంగనాథస్వామి( Sri Rangapuram Ranganathaswamy ) అంటే ఆమెకు ఎంతో ప్రేమ.మొదటి పెళ్లి కూడా ఈ స్వామివారి ఆలయంలోనే చేసుకుంది.తమ పెళ్లి విషయం తెలిస్తే అభిమానులు గుడికి పోటెత్తే అవకాశం ఉంది కాబట్టి వారు రహస్యంగా పెళ్లి చేసుకున్నారు.
అదితిరావు తల్లి విద్యా రావు.విద్యా రావు తండ్రి రామేశ్వర రావు.
వనపర్తి వంశంలో ఆయనే చివరి రాజు.అదితి నాన్న పేరు ఎహసాన్ హైదరీ.
ఎహసాన్ అక్బర్( Ehsan Akbar ) హైదరీకి మనవడు అవుతాడు.అక్బర్ హైదరీ హైదరాబాద్ స్టేట్ కు ఒకప్పుడు ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించాడు.
ఇలా చూసుకుంటే ఈ హీరోయిన్ మూలాలు మొత్తం పాత వనపర్తి సంస్థానం అంటే ప్రస్తుత వనపర్తి జిల్లాలోనే పాతుకుపోయాయి.వనపర్తి జిల్లా వాసులకు శ్రీరంగాపురం రంగనాథస్వామి ఆలయంతో ప్రత్యేక అనుబంధముంది.
తెలంగాణ, కర్నాటకలోని గుల్బర్గా, రాయచూర్, సిందూరు వంటి రకరకాల ప్రదేశాల నుంచి భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు.ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో 400 దాకా పెళ్లిళ్లు జరుగుతాయి.వనపర్తి, పెద్దగూడెం, రాజానగరం, కొత్తపేట తదితర ప్రాంతాల్లోని ఆలయాల బాగోగులను శ్రీకృష్ణదేవరాయ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ సంస్థ చూసుకుంటుంది.ఈ సంస్థకు ఆర్గనైజర్‌గా జె.కృష్ణదేవరావు వ్యవహరిస్తున్నారు.ఈ ప్రాంతంలో ఉన్న ఒక చిన్న గుడిలో అదితిరావు పెళ్లి చేసుకోవడమే ఈ పెళ్లిలో పెద్ద హైలైట్ అని చాలామంది అంటున్నారు.
ఆమె తన మూలాలను మర్చిపోలేదని అది చాలా సంతోషించాల్సిన విషయం అని అంటున్నారు అలాగే సిద్ధార్థ్ ని నమ్మి అదితిరావు తప్పు చేసిందని మరి కొంతమంది అంటున్నారు అతడు అమ్మాయిలను వాడుకొని వదిలేసే బుద్ధి ఉన్నవాడు అని కొంతమంది తిట్టిపోస్తున్నారు మరి వీరిద్దరూ జీవితాంతం కలిసి ఉంటారా లేదంటే విడిపోతారా అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి.