ముఖ్యంగా చెప్పాలంటే బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మహిళ తల్లిగా మారుతుంది.తన శరీరం బిడ్డకు పాలు ఇవ్వడానికి సిద్ధమవుతుంది.
కాబట్టి బిడ్డకు సరైన పోషణ అందాలంటే పిల్లలు పుట్టిన ఆరు నెలల వరకు తల్లిపాలు ( breast milk )అవసరమని నిపుణులు చెబుతున్నారు.ఇవే వారిని ఇన్ఫెక్షన్ల నుంచి, వ్యాధుల నుంచి రక్షిస్తాయి.
ఇలా పాలు పట్టడం పిల్లలకే కాదు తల్లులకు కూడా మంచిదే అని నిపుణులు చెబుతున్నారు.మార్కెట్లో లభించే ఫార్ములా మిల్క్( Formula milk ) తో పాలలో తల్లిపాలలో ఉండే యాంటీ బయోటిక్స్ ఉండవు.
కాబట్టి రొమ్ము పాలు పిల్లలకు పట్టించడం ఎంత ముఖ్యం.కానీ కొందరిలో పాల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది.
అటువంటి వారు ఒకటి లేదా రెండు చెంచాల వామును రాత్రి అంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం వడగట్టి తాగాలి.
ఇది తల్లిపాలను పెంచడంలో ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.బిడ్డకు తల్లిపాలు పట్టించేటప్పుడు తప్పకుండా ప్రతి తల్లి ఈ నియమాలను పాటించాలి.మరి ఆ నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గర్భం తో ఉన్నప్పుడు ధూమపానం( smoking ) చేయడం అసలు మంచిది కాదు.మీకు స్మోకింగ్ చేసే అలవాటు ఉంటే మీ బిడ్డ కోసం పూర్తిగా మానేయడమే మంచిది.
దీనివల్ల తల్లిపాలు తాగే పిల్లలకు ఆ పాలు విషమవుతాయి.పాలిచ్చే తల్లులు మద్యపానం( drinking ) అస్సలు చేయకూడదు.
మద్యం తాగడం వల్ల మీ పాల సరఫరా తగ్గిపోతుంది.అలాగే తల్లి పాలలో 0.5% నుంచి 3.3% వరకు ఆల్కహాల్ ఉంటుందనీ పరిశోధకులు చెబుతున్నారు.అలాగే పిల్లలు తెలివి తక్కువ వారు అవుతారని నిపుణులు చెబుతున్నారు.
మీరు నవజాత శిశువును కలిగి ఉన్నప్పుడు మీరు సరిగ్గా తినడం, తగినంత నిద్రపోవడం, వీలైతే ప్రతి రోజు వ్యాయామం చేయడం వీలైనంత వరకు స్నేహితులు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలి.అలాగే మీ రొమ్ముల రూపంలో ఏవైనా మార్పులు గమనించినట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.తల్లి పాలు పట్టేటప్పుడు తల్లి చేతులు, భుజాలు విశ్రాంతి తీసుకున్నట్లుగా ఉండాలి.
పిల్లల మెడ, భుజాలు వెనుక భాగాలను చేతిలో నిమురుతూ ఉండాలి.నవజాత శిశువు( newborn baby ) పాలు తాగుతున్నప్పుడు ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది.
దీన్ని కూడా తల్లులు గమనిస్తూ ఉండాలి.అలాగే పిల్లల నోట్లో రొమ్ము పెట్టి నిద్రపోకుండా వారు పిల్లలు పాలు తాగి నిద్రపోయే వరకు జాగ్రత్తగా చూస్తూ ఉండాలని నిపుణులు చెబుతున్నారు.