ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న రాకింగ్ రాకేష్ కేసీఆర్.. ఇక్కడైనా హిట్టవుతుందా?

జబర్దస్త్ షో ( Jabardasth Show )ద్వారా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న కమెడియన్లలో రాకింగ్ రాకేష్ ( Rocking Rakesh )ఒకరు.రాకేష్ ఎలాంటి బూతులు లేకుండా స్కిట్లు చేయడం ద్వారా ప్రశంసలు అందుకోవడంతో పాటు ప్రశంసలు అందుకున్నారు.

 Rocking Rakesh Kcr Movie Ott Streaming Details Inside Goes Viral In Social Media-TeluguStop.com

రాకింగ్ రాకేష్ హీరోగా తెరకెక్కిన కేసీఆర్ మూవీ కొంతకాలం క్రితం థియేటర్లలో విడుదల కాగా ఈ సినిమా థియేటర్లలో ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే.

గరుడవేగ అంజి డైరెక్షన్ ( Anji Direction )లో తెరకెక్కిన కేసీఆర్ ఈ నెల 28వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

తెలంగాణ ఉద్యమ నేపథ్యంగా, తెలంగాణ తొలి సీఎంగా కేసీఆర్ ఎన్నికైన పరిణామాలు ప్రధానంగా ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం.ఈ సినిమాలో సత్యకృష్ణన్ కూతురు అనన్య కృష్ణన్ ( Ananya Krishnan )హీరోయిన్ గా నటించి తన అద్భుతమైన నటనతో మెప్పించడం గమనార్హం.

Telugu Ananya Krishnan, Anji, Jabardasth Show, Kcr, Ott, Rakesh, Rakesh Kcr Ott-

నవంబర్ నెల 22వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది.థియేటర్లలో ఆశించిన ఫలితాన్ని అందుకోని ఈ సినిమా ఓటీటీలో హిట్ గా నిలుస్తుందేమో చూడాల్సి ఉంది.రాకింగ్ రాకేశ్ ఈ సినిమా కోసం ఒకింత భారీ స్థాయిలోనే ఖర్చు చేశారు.ఆహా ఓటీటీ ఈ సినిమా డిజిటల్ హక్కులను ఎంత మొత్తానికి కొనుగోలు చేసిందనే ప్రశ్నకు సంబంధించి జవాబు దొరకాల్సి ఉంది.

Telugu Ananya Krishnan, Anji, Jabardasth Show, Kcr, Ott, Rakesh, Rakesh Kcr Ott-

రాకింగ్ రాకేశ్ కేసీఆర్ సినిమా ప్రమోషన్స్ ను సైతం ఒకింత కొత్తగా చేశారనే సంగతి తెలిసిందే.రాకింగ్ రాకేశ్ రాబోయే రోజుల్లో కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.రాకింగ్ రాకేశ్ ను అభిమానించే ఫ్యాన్స్ మాత్రం ఒకింత ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారని కచ్చితంగా చెప్పవచ్చు.కేసీఆర్ సినిమాకు బీ.ఆర్.ఎస్ పార్టీ నేతలు ఫండింగ్ చేశారని జోరుగా ప్రచారం జరగగా ఆ ప్రచారాన్ని రాకింగ్ రాకేశ్ పలు సందర్భాల్లో ఖండించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube