ప్రతి ఒక్కరి వంటింట్లోనూ ఉండే అల్లం ఆరోగ్యానికి ఎంతలా ఉపయోగపడుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.అల్లంలో ఉండే ఔషదగుణాలు ఎన్నో సమస్యలను నివారించడంలో సహాయపడతాయి.
అయితే ఆరోగ్యానికి మాత్రమే కాదు.అందాన్ని రెట్టింపు చేయడంలోనూ అల్లం ఉపయోగపడుతుంది.
అదెలా.అసలు అల్లం చర్మానికి ఎలా ఉపయోగించాలి.
అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
అల్లం పేస్ట్‌లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ మరియు కోకోనట్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని కంటికి తగలకుండా ముఖానికి అప్లై చేయలి.
పావు గంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల ముఖంపై మృతకణాలు పోయి.మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.
అల్లం తీసుకుని పేస్ట్‌లా చేసుకోవాలి.
ఈ పేస్ట్‌ను మొటిమలు, మచ్చలు ఉన్నచోట అప్లై చేసి.పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి.
ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేస్తే సులువుగా మొటిమలు, మచ్చలు తొలగుతాయి.
అల్లం రసంలో కొద్దిగా తేనె మిక్స్ చేసి.
ముఖానికి అప్లై చేయాలి.ఓ అరగంట పాటు ఆరనిచ్చి.
అనంతరం గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల ముఖంపై ముడతలు పోయి.
యవ్వనంగా మారుతుంది.అలాగే అల్లం ఓ మంచి యాంటీ ఆక్సిడెంట్, టోనర్‌గా ఉపయోగపడుతుంది.
తద్వారా ముఖం ప్రకాశవంతంగా మారుతుంది.