కారవాన్ లో కూర్చోవడం.. చిరాకు అనిపించేది.. విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు?

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో లేడీ అమితాబచ్చన్ గా పేరు సంపాదించుకున్న విజయశాంతి అప్పట్లో హీరోయిన్ గా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతలా హవా నడిపించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఒసేయ్ రాములమ్మ లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించింది.

 Vijaya Shanthi About Caravans , Lady Amitabh Bachchan , Vijaya Shanthi , Carav-TeluguStop.com

స్టార్ హీరోల సినిమాల్లో నటించడమే కాదు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో కూడా స్టార్ హీరోలకు మించిన క్రేజ్గా సంపాదించుకుంది విజయశాంతి. ఆ తర్వాత సినిమాలకు గుడ్బై చెప్పేసి రాజకీయాల్లో కొనసాగుతుంది అనే విషయం తెలిసిందే.

ఇక ఎన్నో ఏళ్ల గ్యాప్ తర్వాత మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

దీంతో ఇక విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తే బాగుండు అని కోరుకున్న అభిమానులందరి కోరిక తీరిపోయింది అని చెప్పాలి.సరిలేరు నీకెవ్వరు లో కీలక పాత్రలో నటించింది విజయశాంతి.2020లో సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది.కానీ మళ్లీ ఏ సినిమా జోలికి వెళ్ళలేదు విజయశాంతి.ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయశాంతి తన సినిమా కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది.ఇటీవల కాలంలో హీరో హీరోయిన్ ల తో పాటు కాస్త పేరున్న ఆర్టిస్టులకు కూడా నిర్మాతలు కారవాన్ సమకూరుస్తూ ఉన్నారు.

Telugu Budget, Caravans, Ladyamitabh, Lady Cinemas, Mahesh Babu, Osey Ramulamma,

ఇలాంటి కారవాన్ వల్ల భారీగా బడ్జెట్ ఖర్చు పెరుగుతుంది అన్నది అందరికీ తెలిసిన వాస్తవం.అయితే తనకు మాత్రం కారవాన్ అనేది అస్సలు నచ్చలేదు అని విజయశాంతి ఇటీవల చెప్పుకొచ్చారు.ఇది వరకు యూనిట్ అంతా లైట్ బాయ్ దగ్గరనుంచి ఆర్టిస్టుల వరకు అందరం చెట్టు కింద కూర్చునె వాళ్ళం.

కుటుంబ సభ్యుల్లా కలిసిమెలిసి ఉండే వాళ్ళం.ఇక అక్కడ పనిచేసే వాళ్లు ఏం తినేవాల్లో ఇక ఆర్టిస్టులు కూడా అదే తినే వాళ్ళు.

ఇప్పుడేమో కారవాన్ లో ఉండాలి అంటే చాలా చిరాకు అనిపించింది.ఏదో ఓక గుహలోకి వెళ్ళినట్లుగా అనిపించింది.

బయట కూర్చుని ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటే ఎంతో బాగుంటుంది అంటూ విజయశాంతి చెప్పుకొచ్చారు.ఇక భోజనం చేసి మేకప్ అయిపోయాక కారవాన్ లో ఉండకుండా వెంటనే సెట్స్ లోకి వచ్చే దాన్ని అంటూ విజయశాంతి చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube