ఏపీలో పదో తరగతి టాపర్ కు ఎకరం పొలం.. కలెక్టర్ చేసిన సాయానికి హ్యాట్సాఫ్ అనాల్సిందే!

ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాలు( AP SSC Results ) తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే.ఈ ఏడాది విడుదలైన ఫలితాల్లో 500 కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు.

 Ap Ssc Topper Amulya Inspirational Success Story Details, Ap Ssc Results, Ap Ssc-TeluguStop.com

అయితే అమూల్య( Amulya ) అనే విద్యార్థిని పదో తరగతి పరీక్షల్లో 593 మార్కులు సాధించి వార్తల్లో నిలిచింది.చిలకలూరిపేటలోని తూబాడుకు చెందిన అమూల్యను తల్లీదండ్రులు కూలి పని చేస్తూ ఎంతో కష్టపడి చదివించారు.

అమూల్య సైతం కూలి పనులకు వెళ్తూ ప్రభుత్వ పాఠశాలలో( Government School ) చదివి 593 మార్కులు సాధించి వార్తల్లో నిలిచింది.అమూల్య తల్లీదండ్రులకు ముగ్గురు కూతుళ్లు కాగా ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే తన లక్ష్యమని ఆమె చెబుతున్నారు.

విద్యార్థిని ప్రతిభ గురించి ఆమె తల్లీదండ్రులు పడుతున్న కష్టాల గురించి తన దృష్టి రావడంతో పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు( Collector Arun Babu ) ఈ విద్యార్థినికి ఎకరం పొలం మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చారు.

Telugu Ap Ssc, Ap Ssc Topper, Apssc, Arun Babu, School, Palnadu, Ssctopper-Inspi

భూమి లేని నిరుపేదల పథకం కింద అమూల్య కుటుంబానికి ఈ భూమిని మంజూరు చేయడం జరిగింది.సొంత భూమి ఉంటే మరింత కష్టపడి పిల్లల్ని బాగా చదివించుకుంటామని ఆమె తల్లీదండ్రులు చెబుతున్నారు.అమూల్య కెరీర్ పరంగా మరిన్ని విజయాలను అందుకోవాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

కలెక్టర్ అరుణ్ బాబు మంచి నిర్యం తీసుకున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Telugu Ap Ssc, Ap Ssc Topper, Apssc, Arun Babu, School, Palnadu, Ssctopper-Inspi

పదో తరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థిని అమూల్య భవిష్యత్తులో జరిగే పోటీ పరీక్షల్లో మరిన్ని సంచలనాలు సృష్టిస్తారేమో చూడాల్సి ఉంది.అమూల్య బాల్యం నుంచి ఎంతో కష్టపడి చదివేవారని తెలుస్తోంది.అమూల్య సక్సెస్ స్టోరీని ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అమూల్య లాంటి పేదింటి విద్యార్థులకు ప్రభుత్వం తమ వంతు సహాయ సహకారాలను అందిస్తే భవిష్యత్తులో ఇలాంటి చిన్నారులు అద్భుతాలు చేస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube