ఏకనక్షత్ర వివాహము గురించి తెలుపగలరు?

ఒకే నక్షత్రముల జన్మించిన స్త్రీ, పురుషులకు పెళ్లి చేయాలంటే చాలా మందికి చాలా అనుమానాలు ఉంటాయి.అలా ఉంటే వారిద్దరికీ పెళ్లి చేయకూడదని చాలా మంది భావిస్తుంటారు.

 What Is Story Of Ekanakshathra Vivaham , Devotional , Eka Nakshatra Vivaham ,-TeluguStop.com

అయితే ఇద్దరిదీ ఒఖే నక్షత్రం అయి వారిద్దరూ పెళ్లి చేస్కుంటే ఏలినాటి శని, అష్టమ శని ఒకేసారి వస్తుందట.అయితే ఏక నక్షత్ర వివాహం గురించి అంటే శుభా, అశుభాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

శుభప్రద తారలు

: రోహిణీ, ఆర్దా, మఖా, విశాఖ, పుష్యమి, శ్రవణ, ఉత్తరాభాద్ర రేవతీ… ఈ నక్షత్రాలు వాళ్ల ఏక నక్షత్రం అయి పెళ్లి చేస్కున్నా ఎలాంటి శని కల్గదు.శుభ ఫలితాలు కల్గుతాయి.

మధ్యమ ఫల ప్రదతారలు

: అశ్వినీ, భరణీ, ఆశ్రేషా, స్వాతీ, పూర్వఫల్గుణీ (పూ.ఫ, లేక పుబ్బా) అనూరాధా, మూలా, శతభిషా నక్షత్రములు దంపతులు కాబోవు వారికి ఒకటిగా ఉన్నా… ఈఎనిమిది (8) తారలు, మధ్యమ ఫలమును ఇచ్చును.

దుష్ట ఫలము ఒసంగు తారలు

: పూర్వాభాద్ర, ధనిష్టా, పునర్వసూ, కృత్తికా, మృగశీర్షా, చిత్రా, హస్తా, ఉత్తర ఫల్గుణీ (ఉత్తర) జ్యేష్టా, పూర్వాషాఢా, ఉత్తరాషాడ నక్షత్రములు దంపతులు కాబోవు స్త్రీ, పురుషులకు ఒకటే అయినప్పటికీ వారిరువురికీ ఈ పదకొండు (11) తారలు వినాశనము సంభవించును.

దోష నక్షత్రమైతే పాదములు తేడా ఉంటే మంచిదిగానే భావించి వివాహము చేయవచ్చును.

అలా కాకపోతే కన్యకు ముత్తయిదువుల చేత పంచ పల్లవములతో కూడిన జలంతో, పవిత్ర స్నానము చేయించి, పురోహితుని ఆశీర్వచన, శాంతి మంత్రాలతో వేరొక శుభకరమగు నామమును ధరింప చేసి వివాహం చేయాల్సి ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube