టైఫాయిడ్( Typhoid ).దీనిని ఎంటరిక్ ఫీవర్ అని కూడా పిలుస్తారు.
సాల్మొనెల్ల ఎంటేరికా సరోవర్ టైఫి( Sarovar Typhi ) అనే బాక్టీరియా వల్ల టైఫాయిడ్ వస్తుంది.ఈగలు వ్యాధి కారకాలను మోసుకొచ్చి ఆహారం, నీటిని కాలుషితం చేస్తాయి.
కలుషితమైన ఆహారం, నీరు తినడం లేదా త్రాగడం ద్వారా టైఫాయిడ్ వ్యాపిస్తుంది.సాల్మొనెల్లా టైఫి బ్యాక్టీరియా ప్రేగునాళాల ద్వారా ప్రవేశించి.
ఆ తర్వాత శరీరం మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది.బ్యాక్టీరియా శరీరంలోకి చేరాక వ్యాధి లక్షణాలు కనిపించడానికి దాదాపు రెండు మూడు వారాల సమయం పట్టవచ్చు.
టైఫాయిడ్ లక్షణాల విషయానికి వస్తే.జ్వరంతో ఇది ప్రారంభమవుతుంది.రెగ్యులర్ గా జ్వరం రావడం, విపరీతమైన చమటలు, బలహీనత, పొత్తికడుపు నొప్పి, మలబద్ధకం, తలనొప్పి,( Fatigue, weakness, abdominal pain, constipation, headache ) ఆకలి లేకపోవడం, వికారం, తేలికపాటి వాంతులు, దగ్గు, కండరాల నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.అలాగే కొందరిలో చర్మంపై దద్దుర్లు, గులాబీ రంగు మచ్చలు ఏర్పడుతుంటాయి.
ఇంకొందరిలో అతిసారం తీవ్రంగా ఉండవచ్చు.ఈ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించి తగు పరీక్షలు చేయించుకోవాలి.

టైఫాయిడ్ వ్యాధి నివారణకు రెండు రకాల టీకాలు అందుబాటులో ఉన్నాయి.మొదటి రకం టీకా ఆరు నెలల వయసు పిల్లల నుంచి 45 సంవత్సరాల వరకు ఒకే డోస్ వేస్తారు.ఇంకొక రకం టీకా రెండు సంవత్సరాల వయసు దాటిన వారికి ఇస్తారు.అధిక ప్రమాదం ఉన్నవారికి లేదా వ్యాధి సాధారణ ప్రాంతాలకు ప్రయాణించేవారికి టీకాలు తీసుకోవడం ఎంతో ఉత్తమం.

ఇకపోతే టైఫాయిడ్ ఫీవర్ బారిన పడకుండా ఉండాలంటే పరిశుభ్రతను పాటించడం చాలా ముఖ్యం.ఈ వర్షాకాలంలో శుభ్రమైన నీటిని లేదా కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి.ఇంట్లోకి ఈగలు, దోమలు రాకుండా చూసుకోవాలి.ఏదేనా ఆహారం తినే ముందు మరియు తర్వాత చేతులను సబ్బుతో క్లీన్ చేసుకోవాలి.ఆహార పదార్థాలను మూతలతో కవర్ చేసి పెట్టుకోవాలి.మరియు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.