చుండ్రు.ఒక్కసారి పట్టుకుందంటే అంత త్వరగా దాన్ని వదిలించుకోలేరు.పోని ఉంటే ఉందిలే అని చుండ్రును నిర్లక్ష్యం చేస్తే.దాని వల్ల తలలో దురద, చికాకు, జుట్టు పొడిబారి పోవడం, మొటిమలు వంటి సమస్యలు తలెత్తుతాయి.పైగా హెయిర్ ఫాల్ సమస్య సైతం విపరీతంగా పెరిగిపోతుంది.అందుకే చుండ్రును వదిలించుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తుంటాయి.
అయితే ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ హెయిర్ ప్యాక్‌ను నెలలో రెండు సార్లు వేసుకుంటే చుండ్రు పోవడమే కాదు జుట్టు ఒత్తుగా సైతం పెరుగుతుంది.మరి లేటెందుకు ఆ ప్యాక్ ఏంటో.
ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండీ.
ముందుగా ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల మెంతులు, అర కప్పు వాటర్ వేసుకుని నైటంతా నానబెట్టుకోవాలి.
ఉదయాన్నే నాలుగు మందారం ఆకులు, రెండు మందారం పూలు, గుప్పెడు ఉసిరి చెట్టు ఆకులు, గుప్పెడు గోరింటాకు, గుప్పెడు వేపాకులు, రెండు రెబ్బల కరివేపాకు, గుప్పెడు మునగాకు తీసుకుని వాటర్ తో ఒకటి లేదా రెండు సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో కడిగి పెట్టుకున్న ఆకులు, పూలు వేసుకోవాలి.అలాగే వాటర్‌తో సహా నానబెట్టుకున్న మెంతులు, నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.ఈ పేస్ట్ లో రెండు టేబుల్ స్పూన్ల ఆముదం వేసి జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించాలి.
గంట పాటు షవర్ క్యాప్‌ను ధరించి.ఆపై మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేసుకోవాలి.
నెలకు రెండంటే రెండు సార్లు ఈ ప్యాక్‌ను వేసుకుంటే.చుండ్రు పోయి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.
మరియు జుట్టు త్వరగా తెల్ల బడకుండా కూడా ఉంటుంది.