మోకాళ్ళ నొప్పులకు చెక్ పెట్టే కాబూలీ శనగలు.. ఇలా తీసుకుంటే మరెన్నో హెల్త్ బెనిఫిట్స్!

Kabuli Chickpeas Helps To Get Rid Of Knee Pain! Kabuli Chickpeas, Kabuli Chickpeas Benefits, Latest News, Knee Pain, Health, Health Tips, Good Health, Bone Health,

ప్రస్తుత రోజుల్లో చిన్న వయసులోనే మోకాళ్ల నొప్పుల సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది.ఈ క్రమంలోనే మోకాళ్ళ నొప్పులను వదిలించుకోవడం కోసం మందులు వాడుతుంటారు.

 Kabuli Chickpeas Helps To Get Rid Of Knee Pain! Kabuli Chickpeas, Kabuli Chickpe-TeluguStop.com

కానీ సహజంగానే మోకాళ్ళ నొప్పులను వదిలించుకోవచ్చు.అందుకు కొన్ని కొన్ని ఆహారాలు అద్భుతంగా సహాయపడతాయి.

అటువంటి వాటిలో కాబూలీ శనగలు ఒకటి.మోకాళ్ళ నొప్పులను వదిలించడానికి కాబూలీ శనగలు ఉత్తమంగా సహాయపడతాయి.

ముఖ్యంగా కాబూలీ శనగలను ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే మోకాళ్ల‌ నొప్పులు దూరం అవ్వడమే కాదు మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా మీ సొంతం అవుతాయి.మరి లేటెందుకు కాబూలీ శనగలను ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు కాబూలీ శనగలు వేసి చిన్న మంటపై క‌నీసం ప‌దిహేను నిమిషాల పాటు చక్కగా వేయించుకోవాలి.

Telugu Bone, Tips, Kabulichickpeas, Knee Pain, Latest-Telugu Health

ఇలా వేయించుకున్న కాబూలీ శనగలను చల్లార‌నిచ్చి.ఆ తర్వాత మిక్సీ జార్ లో వేసి మెత్తని పౌడ‌ర్ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.ఈ పౌడర్ ను ఒక బాక్స్ లో నింపుకుని స్టోర్ చేసుకోవాలి.

ఒక గ్లాస్ గోరు వెచ్చని ఆవు పాలలో వ‌న్ టేబుల్ స్పూన్ తయారు చేసి పెట్టుకున్న కాబూలీ శనగల పొడి వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ తేనె కలిపి సేవించాలి.

Telugu Bone, Tips, Kabulichickpeas, Knee Pain, Latest-Telugu Health

రోజు ఉదయం ఇలా చేస్తే కాబూలీ శనగల్లో ఉండే పలు ప్రత్యేక పోషకాలు ఎముకల బలహీనతను నివారిస్తాయి.మోకాళ్ల‌ నొప్పులు, కీళ్ల నొప్పుల‌ను దూరం చేస్తాయి.అంతేకాదు కాబూలీ శనగలను పైన చెప్పిన విధంగా తీసుకుంటే జీర్ణ వ్యవస్థ చురుగ్గా మారుతుంది.మలబద్ధకం సమస్య నుంచి విముక్తి ల‌భిస్తుంది.బ్యాడ్ కొలెస్ట్రాల్ కరుగుతుంది.గుండె ఆరోగ్యంగా మారుతుంది.

శరీరానికి అవసరం అయ్యే ప్రోటీన్ అందుతుంది.నీరసం, అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

రక్తహీనత న‌యం అవుతుంది.మరియు వెయిట్ లాస్ కూడా అవుతారు.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube