కర్ణాటక రాష్ట్రం హంపీలోని విరూపాక్ష ఆలయంలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి.అందులోని రహస్యాలకు కారణం ఏంటో పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు కూడా గుర్తించలేకపోతున్నారు.
అయితే విరూపాక్షస్వామి ముందున్న మంటపం గోడ మీద.రాజగోపురం నీడ ఎప్పుడూ తలకిందులుగా పడుతూ ఉంటుంది.ఇందుకు గల కారణాలను మాత్రం ఇప్పటివరకూ ఏ శాస్త్రవేత్త కనుగొనలేకపోయారు.ఉగాది రోజున ఇక్కడ సూర్యకిరణాలు గర్భగుడిలోని శివలింగం మీద పడటం కూడా ఒక అద్భుతమే.అదేవిధంగా గర్భగుడిలో పడే సూర్యకిరణాలు సాలె మంటపం వద్ద తిరిగి తల కిందులుగా కనిపిస్తాయి.గర్భగుడిలోని ఒక చిన్న రంద్రం ద్వారా ఈ సూర్యకిరణాలు సాలె మంటపంలో పడుతాయి.
ఉదయం 9 గంటల సమయం, సాయంత్రం పూట మాత్రమే ఈ సూర్యకిరణాలు మనకు కనిపిస్తాయి.
ఈ దేవాలయానికి 7 వ శతాబ్దం నుంచి నిర్విఘ్నమైన చరిత్ర ఉంది.విరూపాక్ష-పంపా ఆలయం విజయనగర సామ్రాజ్యం కంటే ముందు నుంచి ఉందని శిలాశాసనాలు చెబుతున్నాయి.10-12 శతాబ్దానికి చెందినవి అయి ఉండవచ్చని చరిత్రకారుల అంచనా.చరిత్ర ఆధారాల ప్రకారం ప్రధాన దేవాలయానికి చాళుక్యుల, హోయ్సళ పరిపాలన మార్పులు చేర్పుల జరిగాయని అయితే ప్రధాన ఆలయం మాత్రం విజయనగ రాజు లే నిర్మించారని అంటారు.తూర్పు ముఖంగా ఉన్న ఈ విరూపాక్షాలయం ప్రధాన రాజ గోపురం పదకొండంతస్తులు కలిగి చాలా ఎత్తుగా ఉంది.
దేవాలయంలో ప్రధాన దైవం విరూపాక్షుడు (శివుడు).ప్రధాన దైవానికి అనుసంధానంగా పంపాదేవి గుడి, భువనేశ్వరీ దేవి గుడి ఉంటుంది.