జ్యోతిష్య శాస్త్రంలో సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాలకు ఎన్నో నియమాలు ఉన్నాయి.ఈ నియమాలను పాటించకపోవడం వల్ల ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంది.
సూర్య సమయం తర్వాత ఇలాంటి పనులు మానుకోవాలని చాలా స్పష్టంగా చెప్పారు.సాయంత్రం పూట ఇంట్లో ఉర్చడం, గడప మీద కూర్చోకూడదని, గోళ్లు కత్తిరించడం లాంటి పనులు చేయకూడదని పెద్దలు చెబుతూనే ఉంటారు.
సూర్యాస్తమయం తర్వాత గరిష్ట ప్రతికూల శక్తి వాతావరణం లో ఉంటుందని చాలా మంది ప్రజలను నమ్ముతారు.
అటువంటి పరిస్థితులలో సూర్యాస్తమయం తర్వాత కొన్ని పనులు చేయడం మరిచిపోకూడదు ఇలా చేయడం వల్ల వ్యక్తి వృద్ధిపై ప్రభావం పడే అవకాశం ఉంది.
కొన్ని శాస్త్రాల ప్రకారం సూర్యాస్తమయం తర్వాత పొరపాటున కూడా గోర్లు కత్తడించడం, జుట్టు, గడ్డం చేయించుకోవడం వంటి పనులు అస్సలు చేయకూడదు.ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంది.
ఇది మాత్రమే కాకుండా ఆ వ్యక్తి ఎప్పుడూ అప్పుల్లో ఉండే అవకాశం కూడా ఉంది.
దానివల్ల అప్పుల నుండి బయటపడలేడు.ఎందుకంటే చీకటి పడిన తర్వాత జుట్టు కత్తిరించడం వల్ల కటింగ్ చేసిన చిన్న చిన్న వెంట్రుకలు ఇంట్లో పడతాయి.దీనివల్ల మనం భోజనం చేస్తున్నప్పుడు ఆ భోజనంలోకి ఆ వెంట్రుకలు పడడంతో అనారోగ్య సమస్యలు వచ్చి డబ్బు ఖర్చవుతుంది కాబట్టి.
చీకటి పడిన తర్వాత మొక్కలను తాకడం అసలు మంచిది కాదు.మొక్కలకు ప్రాణం ఉంటుందని ఎంత నిజమో అవి సూర్యాస్తమయం లో ఆక్సిజన్ ఇవ్వడం తగ్గిస్తాయి అనడంలోను సందేహం లేదు.
అందుకే సూర్య సమయం తర్వాత చెట్లను, మొక్కలను తాకకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు.అంతేకాదు సాయంత్రం తర్వాత చెట్లను నీరు పెట్టడం కూడా మానుకోవడమే మంచిది.సూర్య సమయం తర్వాత చెట్లు, మొక్కలు నిద్రపోతాయని చెబుతూ ఉంటారు.