అయోధ్యలో బాలరాముడు విగ్రహాన్ని ఇటీవలే ప్రాణప్రతిష్ట చాలా ఘనంగా జరిగింది.దాదాపు వందల ఏళ్ల తర్వాత రాముడు తిరిగి వచ్చారు.
కాబట్టి దేశ ప్రజలు చాలా సంబరాలు చేసుకుంటున్నారు.ఇక చాలా ప్రాంతాలలో కూడా అక్కడ ఉండేటువంటి రామ మందిరాల( Ram Mandir ) గుడులలో కూడా ఎన్నో ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు.
ముఖ్యంగా రామ మందిరం ప్రారంభం రోజున దేశవ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం వచ్చింది.ఇక చాలామంది సిని సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా ఈ ప్రాణ ప్రతిష్ట రోజున అయోధ్యకు వెళ్లడం జరిగింది.
ఇక దాదాపుగా మొదటి రోజు 5 లక్షల మందికి పైగా భక్తులు అయోధ్య( Ayodhya ) రాముని మందిరాన్ని దర్శించుకున్నారు.
ఇక రోజురోజుకీ భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది.ఈ రామ్ లల్లా విగ్రహాన్ని కర్ణాటకకు చెందిన అరుణ్ యోగిరాజ్( Arun Yogiraj ) అన్న శిల్పి చెక్కడం జరిగింది.అయితే 1076-1126 CE ముందు నుండి అయోధ్యలో రామాలయం ఉండేదట అప్పుడే రామ్ లల్లా విగ్రహం( Ram Lalla Idol ) ఆరడుగుల పాటు బాలరాముడు విగ్రహం ఉండేదట.
కాలక్రమంగా అక్రమాలు జరిగి అక్కడ చాలా విస్ఫోటనాలు సృష్టించడం జరిగింది.ఇక కొంతమంది అగంతకులు ఆ తర్వాత నెమ్మదిగా తవ్వకాలను జరిపిస్తే బాల రాముడి విగ్రహం బయటపడింది.
ఇక దాదాపు మళ్ళీ 700 సంవత్సరాల తర్వాత అయోధ్యలో రామ మందిరాన్ని మళ్లీ నిర్మించడం జరిగింది.ఈ రాముడు దర్శనం కోసం చాలామంది అయోధ్యకు వెళుతున్నారు.
అయితే అయోధ్యలోని రాముడు భక్తులను చూస్తున్నట్లుగా ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.ఈ అద్భుతమైన వీడియో చూసిన భక్తులందరూ ఆశ్చర్యపోతున్నారు.విగ్రహం కళ్ళు మెల్లగా తెరిచి చూడడాన్ని చాలామంది వీక్షించారు.అయితే ఈ అద్భుతం AI సృష్టించింది మాత్రమే అని తెలుస్తుంది.అయితే AI సృష్టించిన ఈ అద్భుతాన్ని చూసి చాలామంది ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు.అయితే సాక్షాత్తు రాముడే కళ్ళు కదిలించి నవ్వుతున్నట్లుగా ఆ వీడియోలో కనిపించడం అందరిని ఆశ్చర్యపరిచింది.