సాధారణంగా చాలా మంది చింత పండు తీసుకుని లోపల ఉండే గింజలను పారేస్తుంటారు.అయితే చింత పండులోనే కాదు.
చింత గింజల్లోనూ మినరల్స్, ప్రోటీన్స్, ఎమినో యాసిడ్స్, ఫ్యాటి యాసిడ్స్, ఫైబర్ ఇలా బోలెడన్ని పోషకాలు నిండి ఉంటాయి.అందుకే చింత గింజలు ఎన్నో జబ్బులను కూడా నివారిస్తాయి.
ముఖ్యంగా నేటి కాలంలో చాలా మంది అధిక బరువు తగ్గించుకునేందుకు డైటింగ్లు, వర్కౌట్లు, యోగాలు ఇలా ఎన్నో చేస్తుంటారు.అయితే అధిక బరువును తగ్గించడంలో చింత గింజలు ఎఫెక్టివ్‌గా పని చేస్తాయి.
చింత గింజలను డ్రై రోస్ట్ చేసి.రెండు లేదా మూడు రోజుల పాటు మంచి నీటిలో నాన బెట్టుకోవాలి.
ఆ తర్వాత చింత గింజలకు ఉండే పై పొట్టు తీసేసి.ఎండ బెట్టుకుని పొడి చేసుకోవాలి.
ఈ పొడిని గోరు వెచ్చని నీటిలో అర స్పూన్ చొప్పున కలిపి సేవించాలి.ఇలా ప్రతి రోజు చేస్తే శరీరంలో పేరుకు పోయిన కొవ్వు కరుగుతుంది.
దాంతో బరువును తగ్గుతారు.
అలాగే రక్త హీనత సమస్యను దూరం చేయడం లోనూ చింత గింజలు ఉపయోగపడతాయి.
పాలలో చింత గింజల పొడి మరియు తేనె కలిపి తీసుకోవాలి.ఇలా ప్రతి రోజు తీసుకుంటే.
హిమోగ్లోబిన్ ఉత్పత్తి పెరుగుతుంది.దాంతో రక్త హీనత సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
అంతే కాదు, పాలలో చింత గింజల పొడి కలిపి తీసుకుంటే కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి.
ఇక చింత గింజల పొడితో పళ్లు తోముకుంటే చాలా మంచిది .చింత గింజల్లో ఉండే పలు పోషకాలు దంత మరియు చిగుళ్ల సమస్యలను నివారిస్తాయి.అలాగే చింత గింజల పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి మౌత్ వాష్‌లా ఉపయోగించవచ్చు.
ఇలా చేయడం వల్ల నోటి దుర్వాసన సమస్య తగ్గు ముఖం పడుతుంది.